Lata Mangeshkar Raj Singh: ప్రేమ అంటే ఓ అందమైన జీవితమే. అందమైన విషాదం కూడా ఉంటుంది. ప్రేమలో జీవించిన వారు ప్రేమలో మరణించే వారు ఉన్నా ప్రేమను బతికించుకుంటూ బతికిన వారు మాత్రం కొందరే ఉంటారు. వారి చరిత్రలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రేమించుకున్నా పెద్దలను ఎదిరించలేక తమ ప్రేమను పంచుకుని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒకరి కోసం మరొకరు ఉండటం అనేదే ఓ మధురానుభూతి. దానికి చాలా సహనం కావాలి. ప్రేమ మీద నమ్మకం ఉండాలి. దాని కోసం జీవితాన్ని ధారపోయాలి. చివరకు ప్రేమనే త్యాగం చేయాలి. ప్రేమలోనే బతికున్నంత కాలం ఉండటమనేదే ఓ మధురస్వప్నం.

తెరమీద బొమ్మల జీవితాలు తెర వెనుక విషాదాన్ని పంచుతాయి. అందరికి తెలిసిన జీవితం వేరే తెలియని జీవితం వేరే ఉంటుంది. దీంతో వారు జీవితాంతం అందులోనే కుమిలిపోతుంటారు. ఇందుకు ఇటీవల మరణించిన గాయని లతా మంగేష్కర్ జీవితం కూడా వేరు కాదు. తన జీవితంలో కూడా ఓ విషాద గాథ దాగి ఉందనే విషయం ఎవరికి తెలియదు. పైకి అందరు మెచ్చుకునే జీవితమే కనిపిస్తుంది కానీ లోపల మరో కోణం ఉంటుంది. దీంతో తన జీవితాన్ని సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తిగా నిలిచిపోయింది. ప్రియుడు సైతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోవడం తెలిసిందే. ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఆమె కూడా తనజీవిత కాలంలో పెళ్లి చేసుకోకపోవడం విషాదకరమే.

అప్పట్లో ఆమె పాటలు పాడే సమయంలోనే స్టార్ క్రికెటర్ రాజ్ సింగ్ దుంగాపూర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. ఊసులు పంచుకున్నారు. ఆశలు పెంచుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. వారి ప్రేమను కాదంది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోకపోయినా జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవడం గమనార్హం. వారిది స్వచ్ఛమైన ప్రేమ. మరొకరికి పంచకుండా వారి ప్రాణం ఉన్నంత వరకు అలాగే ఉండటం అంటే మాటలు కాదు.
Also Read: Lata Mangeshkar: ‘ప్రపంచ కప్’ గెలవాలని లతాజీ ఏమి చేసేవారే తెలుసా ?
రాజ్ సింగ్ ది రాజ కుటుంబం. వారికో సంస్థానం కూడా ఉండేదట. అంతటి ఖ్యాతి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేదు.కానీ తల్లిదండ్రులకు మాత్రం తన ప్రేమ విషయం చెప్పాడు. తాను లతను పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాట చెప్పినా ఇంట్లో వారు ఒప్పుకోలేదు. సినిమాల్లో పాటలు పాడే అమ్మాయిని ఇంటి కోడలుగా తెస్తావా అని నానా మాటలన్నారు. దీంతో రాజ్ సింగ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. తన ప్రేమను మరిచిపోవాలని తాను కూడా ఒంటరిగానే ఉంటానని అలాగే పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు.
ఇద్దరు పరస్పర అంగీకారంతోనే జీవితంలో పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు. అల్జీమర్స్ లో 2009లో రాజ్ సింగ్ మరణించినా లత మాత్రం ఇప్పటి వరకు జీవించి ఉన్నారు. ఎంతో అందంగా పాటలుపాడే మధురమైన గొంతు మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆమె జీవితంలో దాగి ఉన్న ఈ విషాద ప్రేమ కథ ఎంత మందికి తెలుసు. అందుకే స్వచ్ఛమైన ప్రేమ కోసం పెద్దలను ఎదిరించలేక తమ ప్రేమన చంపుకున్నారు. అయినా ఇంకో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం మిగిలిపోయారు. ఇంతకన్నా స్వచ్ఛమైన ప్రేమ ఇంకెక్కడైనా ఉంటుందా? ప్రేమలోనే జీవించారు. ప్రేమతోనే మరణించారు.హాట్యాఫ్ టు దెయిర్ లవ్.
Also Read: Lata Mangeshkar: లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఇవే
[…] Puri Jagannadh: తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’పై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ‘జనగణమన’ గురించి మాట్లాడారు పూరీ. ‘‘లైగర్ షూటింగ్ పూర్తయింది. ఈరోజుతో జనగణమన’’ అని ఆయన చెప్పిన పాడ్ కాస్ట్ ను ఛార్మి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్ (#JGM) ను జతచేశారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం మీద టాలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. […]