Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా నుంచి నుంచి రోమియో జూలియట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. అదితి శంకర్ పాడిన ఈ పూర్తి సాంగ్‌ను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ లో లాంచ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ అందించగా.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.

మొత్తానికి ‘గని’ నుంచి వచ్చిన ఈ రోమియో జూలియట్ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఇక థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సర్ ప్రైజ్ చేసింది. ఈ సాంగ్ లో వరుణ్ తేజ్ తో ఒక స్టార్ హీరోయిన్ రొమాన్స్ చేసిందట, మరి చూడాలి ఆ బ్యూటీ ఎవరో. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో ఫైట్ చేయబోతున్నాడు. వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమాపై అంచనాలను పెంచాడు.
Also Read: Modi: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మోడీకి సాధ్యమేనా?
అయితే ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి గనితో వరుణ్ తేజ్ భారీ హిట్ కొడతాడేమో చూడాలి. అయితే, ఈ సినిమా మరో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మొదటిసారిగా నిర్మాతగా మారబోతున్నాడు.

సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని టాక్ ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాల పై ఈ సినిమా వస్తోంది.
Also Read:మహిళా కానిస్టేబుళ్లకు జెంట్స్ టైలర్ తో కొలతలా?
[…] Karate Kalyani: కరాటే కళ్యాణి బాగా బోల్డ్. ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది ఈ నటి. అయితే తాజాగా “నాకు మంచి అబ్బాయి దొరికితే.. పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దాదాపు 250 సినిమాల్లో కరాటే కళ్యాణి నటించినా ఎక్కువగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయింది. కానీ, కరాటే కళ్యాణిలో చాలా కళలే ఉన్నాయి. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆమె. […]