Jayammu Nischayammu Raa Nagarjuna Sushila: ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉండే జగపతి బాబు(Jagapathi Babu), ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులు చూసే ఎలాంటి షోస్ లో కానీ, సీరియల్స్ లో కానీ కనిపించలేదు. మొట్టమొదటిసారి ఆయనతో జీ తెలుగు ఛానల్ ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) అనే ప్రోగ్రాం ని మొదలు పెట్టారు. నిన్న మొదలైన ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య అతిథి గా విచ్చేశాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే జగపతి బాబు అక్కినేని ఫ్యామిలీ కి సినిమాల్లోకి రాక ముందు నుండే ఫ్యామిలీ ఫ్రెండ్ అట. ముఖ్యంగా నాగార్జున సోదరుడు వెంకట్ ఆయనకు అత్యంత ఆప్త మిత్రుడు అనే విషయం కూడా ఈ షో ద్వారానే తెలిసింది. వీళ్ళు కలిసి అప్పట్లో విదేశాల్లో చేసిన రచ్చ, అల్లరి చేష్టలు గురించి ఈ షోలో పంచుకున్నారు. ముందుగా నాగార్జున తో మొదలైన ఈ టాక్ షో, ఆ తర్వాత ఆయన అన్నయ్య వెంకట్, అక్క సుశీల తో కూడా కొనసాగింది.
Also Read: ‘గీతాంజలి’ హీరోయిన్ లేటెస్ట్ లుక్ ని చూసి కంగుతిన్న నాగార్జున..లైవ్ లో ఊహించని సర్ప్రైజ్!
ఈ ఇంటర్వ్యూ లో నాగార్జున గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి, ఆయన USA లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో సోదరి సుశీల ద్వారా తెలిసింది. ముందుగా జగపతి బాబు నాగార్జున ని ఒక ప్రశ్న అడుగుతూ ‘USA రోజుల్లో నువ్వు చేసిన కొన్ని చిలిపి పనులు గురించి చెప్పు’ అని అడుగుతాడు. అప్పుడు నాగార్జున ‘అవన్నీ ఇప్పుడు ఎందుకు నాకు గుర్తు కూడా లేవు’ అని అంటాడు. అప్పుడు వెంటనే నాగార్జున సోదరి సుశీల మాట్లాడుతూ ‘అప్పట్లో నేను USA లో వారానికి ఒకసారి నాగార్జున తన స్నేహితులతో కలిసి ఉండే రూమ్ కి వెళ్లేదానిని. వాళ్ళ గది ఎంత చెత్తగా ఉండేది అంటే, తినేసి ప్లేట్లు, స్పూన్లు కూడా కడిగేవాళ్ళు కాదు, అలాగే వదిలేసేవాళ్ళు’.
‘అప్పటికప్పుడు ఏదైనా తినడానికి స్పూన్ కోసం వెతికితే, నేరుగా సింక్ నుండి తీసుకోవాల్సిన పరిస్థితి. అంత బద్దకంగా రూమ్ ని మైంటైన్ చేసేవాళ్ళు. నేను వచ్చి రూమ్ మొత్తం శుభ్రం చేసి, అంట్లు మొత్తం తోమి వెళ్లేదానిని. బాత్ టబ్బు ని కూడా చాలా దరిద్రం గా ఉంచేవాళ్ళు. అవి కూడా నేనే శుభ్రం చేసేదానిని’ అని అంటుంది. అప్పుడు నాగార్జున ‘నువ్వు నన్ను గొప్ప లెజెండ్ అని ఇక్కడ కూర్చోబెట్టావు, కానీ నాలోని చెడు అలవాట్ల గురించి జనాలకు చూపిస్తూ నా పరువు తీస్తావా’ అని అంటాడు. అప్పుడు జగపతి బాబు స్పందిస్తూ ‘మరి అదే జయమ్ము నిశ్చయమ్మురా షో అంటే. అలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా తయారయ్యావో చూడు’ అని అంటాడు. అప్పుడు నాగార్జున సోదరి స్పందిస్తూ ‘అది నిజమే..అలా ఉండే నాగార్జున ఇప్పుడు ఎలా తయారు అయ్యాడంటే,తన ఇంటికి వెళ్లి చూడండి, గచ్చు కూడా అడ్డం లాగా ఉంటుంది, అంతటి శుభ్రత మైంటైన్ చేస్తూ వస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
