Jayammu Nischayammu Raa: ఈమధ్య కాలం లో వచ్చిన టాక్ షోస్ లలో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన టాక్ షో ఏదైనా ఉందా అంటే అది ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK'(Unstoppable With NBK) షో అనడం లో ఎలాంటి సందేహం లేదు. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్గెస్ట్ టాక్ షో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చూసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షోకి సంబంధించి మరో కొత్త సీజన్ వస్తుందో లేదో తెలియదు కానీ, ఆ షో ని తలదన్నే మరో బిగ్గెస్ట్ టాక్ షో వచ్చేసింది. అదే జగపతి బాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) షో. రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ టాక్ ప్రారంభం అయ్యింది. ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య అతిథి గా విచ్చేశాడు.
Also Read: ‘గీతాంజలి’ హీరోయిన్ లేటెస్ట్ లుక్ ని చూసి కంగుతిన్న నాగార్జున..లైవ్ లో ఊహించని సర్ప్రైజ్!
ఈ ఎపిసోడ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెటిజెన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ ని బాగా వీక్షిస్తున్నారు. ఇందులో నాగార్జున మరియు జగపతి బాబు మధ్య జరిగిన సంభాషణ చాలా సహజం గా అనిపించింది. ‘అన్ స్టాపబుల్’ షో కూడా కాస్త స్క్రిప్టెడ్ లాగా అనిపించింది కానీ, ఈ షో మాత్రం ఎలాంటి ఫిల్టర్ లేకుండా సాగినట్టు అనిపించింది. అందుకే ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈమధ్య కాలం లో జీ తెలుగు షోస్ కి టీఆర్ఫీ రేటింగ్స్ పెద్దగా రావడం లేదు. రీసెంట్ గా మొదలైన ‘డ్రామా జూనియర్స్ 8’ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తర్వాత అంతటి రెస్పాన్స్ ఈ ప్రోగ్రాం కి వచ్చిందని అంటున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం టీవీ టెలికాస్ట్ లో ఈ ప్రోగ్రాం కి కచ్చితంగా 7 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు.
జీ5 యాప్ లో కూడా మంచి వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది ఈ ఎపిసోడ్. ఇలాగే ఆర్గానిక్ గా ఈ టాక్ షో ముందుకు వెళ్తే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ కి మించిన సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు నెటిజెన్స్. ఇక రెండవ ఎపిసోడ్ కి ముఖ్య అతిథి గా శ్రీలీల విచ్చేసింది. కాసేపటి క్రితమే ఈ ప్రోమో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇలా క్రేజీ స్టార్స్ అందరితో జగపతి బాబు చేసే ఈ అన్ ఫిల్టర్ టాక్ షో లో ఫన్, ఎమోషన్స్ తో ఒక రోలర్ కోస్టర్ రైడింగ్ లాగా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.