Jayammu Nischayammu Raa Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సాధారణంగా టాక్ షోస్ కి చాలా దూరంగా ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అతని మనసుకి బాగా దగ్గరైన వాళ్ళకు మాత్రమే ఆయన ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తుంటాడు. రీసెంట్ గానే జీ తెలుగు లో జగపతి బాబ(Jagapathi Babu) వ్యాఖ్యాతగా ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) అనే ప్రోగ్రాం మొదలైంది. ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ చూసేంత వరకు ఎవరికీ తెలియదు, నాగార్జున మరియు జగపతి బాబు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం. ఒకరిని ఒకరు ‘రా’ అని పిలుచుకునేంత స్నేహం వీళ్ళ మధ్య ఉంది. కేవలం నాగార్జున తో ఒక్కటే కాదు, జగపతి బాబు కి ఆయన అన్నయ్య వెంకట్ తో, సోదరి సుశీలతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది అనేది కూడా ఈ ఇంటర్వ్యూ తోనే తెలిసింది.
Also Read: ‘గీతాంజలి’ హీరోయిన్ లేటెస్ట్ లుక్ ని చూసి కంగుతిన్న నాగార్జున..లైవ్ లో ఊహించని సర్ప్రైజ్!
ఆద్యంతం వినోదభరితంగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ఫన్నీ సంఘటనలు ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి. జగపతి బాబు నాగార్జున సోదరుడు వెంకట్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నాగార్జున లోని మన్మథుడిని మీరెప్పుడు గుర్తించారు?’ అని అడగ్గా, వెంటనే నాగార్జున మాట్లాడుతూ ‘మా అన్నయ్య ని అడగాల్సిన ప్రశ్నలేనా ఇవి’ అని జగపతి బాబు ని నవ్వుతూ తిడుతాడు. అప్పుడు జగపతి బాబు సమాధానం చెప్తూ ‘ఇది సిగ్గులేని షో, ఏదైనా మాట్లాడుకోవచ్చు’ అని అంటాడు. అప్పుడు నాగార్జున నవ్వుతూ ‘నీకు సిగ్గులేదేమో..నాకు మాత్రం సిగ్గుంది’ అని అంటాడు. అప్పుడు జగపతి బాబు ‘అబ్బా..సిగ్గు గురించి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా?’ అని అంటాడు. అలా ఆద్యంతం చాలా ఫన్నీ గా ఈ సంభాషణ జరిగిపోతుంది. అప్పుడు నాగార్జున సోదరుడు వెంకట్ మాట్లాడుతూ ‘నాగార్జున కంటే ముందు నువ్వు మన్మథుడు అయ్యావు’ అని అంటాడు. అప్పుడు జగపతి బాబు ‘ఇది చీటింగ్..దీనిని నేను ఖండిస్తున్నాను’ అని అంటాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను నాగార్జున ని చూసే మన్మథుడు ఎలా అవ్వాలో నేర్చుకున్నాను’ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘అయితే మన్మథుడు అయ్యావు అని ఒప్పుకుంటున్నావు అన్నమాట’ అని అంటాడు, అప్పుడు జగపతి బాబు ‘నువ్వు ఒప్పుకుంటే నేను కూడా కచ్చితంగా ఒప్పుకుంటా’ అని అంటాడు. ఈ ఇంటర్వ్యూ లో తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగార్జున స్కూల్ డేస్ లో చాలా పొట్టిగా ఉండేవాళ్ళట, ఆయన స్కూల్ లో పొట్టిగా ఉండేవాళ్ళకు షార్ట్ సైజు చెడ్డీలను మాత్రమే వేసుకోవడానికి అనుమతిని ఇచ్చేవారట, అంతే కాదు, నాగార్జున స్కూల్ డేస్ మొత్తం కేవలం అబ్బాయిలు ఉండే క్లాసులలోనే జరిగేదట. ఇలా ఎన్నో ఫన్నీ సంఘటనలను ఈ ఇంటర్వ్యూ లో నాగార్జున పంచుకున్నాడు,వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ ని జీ 5 యాప్ ఓపెన్ చేసి చూసేయండి.
