Robin Hood Vs Court Movie : ఓటీటీ వృద్ధిలోకి వచ్చిన తర్వాత మన తెలుగు సినిమాలకు థియేట్రికల్ రన్ బాగా తగ్గిపోతుందని నిన్న మొన్నటి వరకు ఒక కామెంట్ వినిపించేది. కానీ అదంతా కేవలం అపోహలు మాత్రమే అని రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు నిరూపించి చూపిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన కోర్ట్(Court Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలై అప్పుడే 17 రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద జోరు ఏమాత్రం తగ్గలేదు. ఉగాది కానుకగా విడుదలైన సినిమాలలో ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం కంటే ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు వస్తుండడం అందరినీ షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా 17 వ రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 13 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
Also Read : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?
నేడు కూడా ఈ చిత్రానికి అదే రేంజ్ టికెట్స్ సేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం మూడవ వీకెండ్ లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానికి మొదటి వీకెండ్ మొత్తానికి కలిపి వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది. థియేటర్స్ ఆ సినిమాకు ఉన్నన్ని ఈ చిత్రానికి ఉండుంటే కచ్చితంగా ఆ చిత్రాన్ని దాటేసేదని అంటున్నారు. మీడియం రేంజ్ సినిమా, ఈపాటికి ఓటీటీ లో విడుదలై ఉండాలి. కానీ ఇప్పటికీ థియేటర్స్ లో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుందంటే మంచి సినిమాని మన ఆడియన్స్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. నైజాం ప్రాంతంలో 10 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ లో కోటి 88 లక్షలు, ఆంధ్ర లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో 5 కోట్ల రూపాయిలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి రెండు కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 17 రోజులకు గాను 28 కోట్ల రూపాయిల షేర్, 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.