Jawaan collections : జవాన్ కలెక్షన్స్… బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన షారుక్!

అట్లీ తేరి, మెర్సల్, బిగిల్ వంటి హిట్ చిత్రాలతో పాప్యులర్ అయ్యారు. బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా సత్తా చాటాడు.

Written By: NARESH, Updated On : September 8, 2023 9:21 am

Jawan Twitter Talk

Follow us on

Jawaan collections : షారుక్ ఖాన్ బాక్సాఫీస్ దండయాత్ర మొదలుపెట్టాడు. జవాన్ మూవీ ఊహించినట్లే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సామాజిక అంశం టచ్ చేస్తూ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 7న జవాన్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఫస్ట్ షో నుండి సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. అలాగే ట్రైలర్ ఆకట్టుకోగా ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున జరిగాయి. పఠాన్ కి మించి జవాన్ చిత్రం పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

ఇక ఫస్ట్ డే జవాన్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఇండియాలో రూ. 75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో పఠాన్ రూ.55 కోట్లు , కెజిఎఫ్ 2 రూ. 54 కోట్లు, బాహుబలి 2 రూ. 41 ఫస్ట్ డే రికార్డ్స్ జవాన్ బ్రేక్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ జవాన్ రూ. 125 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. బాహుబలి 2 పేరిట ఉన్న రూ. 121 కోట్ల రికార్డు సైతం జవాన్ బ్రేక్ చేసింది.

షారుక్ గత చిత్రం పఠాన్ ఫస్ట్ డే ఇండియాలో రూ. 55 కోట్లు, వరల్డ్ వైడ్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ మూవీతో షారుక్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాడు. జవాన్ చిత్రానికి లాంగ్ వీకెండ్ ఉంది. వీకెండ్ ముగిసే నాటికే జవాన్ రూ. 50 కోట్ల మార్క్ దాటేసే అవకాశం కలదు. అలాగే జవాన్ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా లాభాలు పంచే సూచనలు కనిపిస్తున్నాయి.

జవాన్ చిత్రాన్ని తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించారు. ఆయనకు ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇది. అట్లీ తేరి, మెర్సల్, బిగిల్ వంటి హిట్ చిత్రాలతో పాప్యులర్ అయ్యారు. బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా సత్తా చాటాడు. షారుక్ ఖాన్ కి జంటగా నయనతార నటించింది. దీపికా పదుకొనె స్పెషల్ రోల్ చేసింది. విజయ్ సేతుపతి విలన్ గా అలరించారు. ప్రియమణి మరో కీలక రోల్ చేసింది. జవాన్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.