Jatt Movie Collection: ఒకప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరోగా విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేసి, మాస్ అనే పదానికి సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన సన్నీ డియోల్(Sunny Deol), రీసెంట్ గానే ‘గద్దర్ 2’ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని మరోసారి కొల్లగొట్టి తన సత్తాని నేటి తరం ఆడియన్స్ కి పరిచయం చేశాడు. అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తన అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తో ‘జాట్'(Jaat Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. మొన్న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
Also Read: మళ్ళీ బిజీ అయిపోయిన హీరోయిన్ కృతి శెట్టి..చేతినిండా సినిమాలే!
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజు లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక రెండవ రోజు కూడా అదే స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది. రెండు రోజుల్లో రెండు లక్షల టికెట్స్ అమ్ముడుపోయిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్స్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక నేడు అయితే ఈ చిత్రానికి వచ్చే వసూళ్లు మొదటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. మాస్ సెంటర్స్ లో అయితే చాలా కాలం తర్వాత కౌంటర్లు వద్ద క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి.
రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ‘చావా’ తర్వాత బాలీవుడ్ లో సరైన హిట్ లేకపోవడం తో భారీ స్పేస్ ఏర్పడింది. ఆ స్పేస్ ని ఈ చిత్రం పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తూ ముందుకు పోతే ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. అదే విధంగా ఈమధ్య కాలంలో ఎక్కవగా లేడీ విలన్ రోల్స్ లో కనిపిస్తున్న రెజీనా, మరోసారి ఈ చిత్రం లో లేడీ విలన్ గా కనిపించింది. అదే విధంగా యంగ్ హీరో రణదీప్ హూడా ఇందులో మెయిన్ విలన్ గా నటించాడు.