బాక్సాఫీస్ వద్ద పోరాటం భలే విచిత్రంగా సాగుతుంది. కొన్ని సినిమాలకు.. రిలీజ్ కాబోతున్న వాటిని చూస్తే భయం! మరికొన్ని సినిమాలకు ఆల్రెడీ ఆడుతున్న సినిమాలను చూసి టెన్షన్! ఈ వారం విడుదలైన మూడు చిత్రాలు రెండో తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
Also Read: మూవీ రివ్యూః శశి
ఈ శుక్రవారం (మార్చి 19) రిలీజైన మూడు చిత్రాల్లో ఒకటి విష్ణు ‘మోసగాళ్లు’, రెండోది కార్తికేయ ‘చావుకబురు చల్లగా’, మూడోది ఆది ‘శశి’. ఈ మూడు చిత్రాల్లోని హీరోల కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లకు అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి. అయితే.. ఈ ముగ్గురికీ ఎదురు నిలబడ్డారు ఆ ముగ్గురు!
‘జాతిరత్నాలు’గా తెలుగు ఆడియన్స్ ను వారం రోజులుగా ఊపేస్తున్నారు నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్ లోనూ కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. యూఎస్ లో లాంగ్ రన్ లో మిలియన్ డాలర్లు కొల్లగొట్టే సినిమాగా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో.. అప్పటి నుంచి లాభాలతోనే గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు మేకర్స్.
Also Read: మూవీ రివ్యూః చావుకబురు చల్లగా
అయితే.. ఈ సినిమా రెండో వారంలోనూ స్టడీగా కలెక్షన్లు సాధిస్తుండడం.. తాజాగా విడుదలైన హీరోలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఎందుకంటే.. ఈ మూడు సినిమాల టాక్ ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద దెబ్బే తగులుతుంది. ఇప్పటికే సూపర్ హిట్ గా పేరు తెచ్చుకున్న సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు.. నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకు వెళ్లడానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపించరు.
కాబట్టి.. తమ సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయోనని ఈ ముగ్గురు హీరోలు.. మూడు జాతిరత్నాలను చూసి ఆందోళన చెందుతున్నారు. మరి, ఈ మూడు సినిమాల్లో ఎవరు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారు..? ఎవరు జాతిరత్నాలను ఎదుర్కొంటారు? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్