Japan Rangasthalam Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఏమిటి అని అడిగితే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పే పేరు ‘రంగస్థలం’ సినిమా గురించి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ చరణ్ కి తిరుగులేని ఫామ్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. అంతకు ముందు రామ్ చరణ్ కి ఒకే మూస సినిమాలు చేస్తున్నాడని ఒక చెడ్డ పేరు ఉండేది. యాక్టింగ్ కూడా చాలా రొటీన్ అయిపోయింది అని కామెంట్స్ చేసేవాళ్ళు.
కానీ ఎప్పుడైతే రంగస్థలం చిత్రం విడుదలైందో అప్పటి నుండి రామ్ చరణ్ మీద జనాల్లో ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. విలక్షణ నటుడిగా ఆయనని పరిగణించడం ప్రారంభించారు. ఈ సినిమా ఒక నటుడిగా రామ్ చరణ్ ని ఎవ్వరూ అందుకోలేని రేంజ్ శిఖరాగ్ర స్థాయికి చేర్చింది. ఇక బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే అప్పట్లోనే ఏ ఈసినిమా 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
అయితే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసారు. అక్కడ కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ఎన్ని దక్కించుకున్న ఈ సినిమా 10 రోజుల రన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ సినిమా 30 మిలియన్ కి పైగా జపనీస్ డాలర్స్ ని వసూలు చేసినట్టు జపాన్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాకి రోజుకు 300 నుండి 400 టికెట్స్ అమ్ముడుపోయాయని. అదే కలెక్షన్స్ స్టడీ గా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.
ఇలాంటి ట్రెండ్ గతం లో #RRR చిత్రానికి మాత్రమే ఉండిందని, ఆ తర్వాత మళ్ళీ అదే రేంజ్ ట్రెండ్ ఈ సినిమాకే చూస్తున్నామని చెప్తున్నారు. రామ్ చరణ్ తో పాటుగా ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో రామ్ చరణ్ కి మాత్రమే ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పడానికి జపాన్ లో రంగస్థలం సృష్టిస్తున్న ప్రభంజనమే ఒక ఉదాహరణ అని అంటున్నారు ఫ్యాన్స్.