https://oktelugu.com/

Director Gunasekhar: గుణశేఖర్ కి నమ్మకద్రోహం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ – రానా దగ్గుపాటి..వైరల్ అవుతున్న కామెంట్స్

అయితే రీసెంట్ గా 'హిరణ్య కశ్యప' అనే పేరు మీద ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ సినిమాలో కూడా హీరో రానానే. దీని పై గుణశేఖర్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ 'దేవుడి మీద సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా విలువలు పాటించి నిజాయితీ తో తియ్యాలి. విలువలు లేకుండా సినిమాలు తీస్తే ఆ దేవుడికి ఎదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది జాగ్రత్త' అంటూ లోక ట్వీట్ వేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : July 22, 2023 / 04:42 PM IST

    Director Gunasekhar

    Follow us on

    Director Gunasekhar: ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక హీరో చెయ్యాల్సిన సినిమాని మరో హీరో చెయ్యడం అనేది సర్వసాధారణం. కొన్ని కారణాల చేతనో,లేదా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వలనో అలాంటివి జరుగుతుంటాయి. అయితే మొదటిసారి ఒక డైరెక్టర్ చెయ్యాల్సిన సినిమా స్టోరీ ని మరో డైరెక్టర్ లాగేసుకోవడం జరిగింది.

    ఇక అసలు విషయం లోకి వస్తే ప్రముఖ దర్శకుడు గుండశేఖర్ చాలా సంవత్సరాల క్రితం హీరో రానా తో కలిసి ‘హిరణ్య కశ్యప’ అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. కొంతవరకు షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాని ఔట్పుట్ సరిగా రాలేదని సురేష్ బాబు అప్పట్లో ఆపేసి, కథని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని రమ్మని చెప్పాడు. అయితే ఆ తర్వాత గుణశేఖర్ తన సినిమాలతో తాను బిజీ గా మారిపోతే, రానా కూడా తన ప్రాజెక్ట్స్ తో తాను బిజీ అయ్యాడు. ఇక ఈ ప్రాజెక్ట్ అత్తికెక్కిందని అందరూ అనుకున్నారు.

    అయితే రీసెంట్ గా ‘హిరణ్య కశ్యప’ అనే పేరు మీద ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ సినిమాలో కూడా హీరో రానానే. దీని పై గుణశేఖర్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘దేవుడి మీద సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా విలువలు పాటించి నిజాయితీ తో తియ్యాలి. విలువలు లేకుండా సినిమాలు తీస్తే ఆ దేవుడికి ఎదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ లోక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. పేర్లని ఎత్తకుండా పరోక్షంగా ఆయన త్రివిక్రమ్, రానా ని తిడుతున్నట్టుగా అందరూ అర్థం చేసుకున్నారు. అయితే దీని రానా ఎలాంటి పరోక్షమైన కౌంటర్ వేయకపోవడం తో ఆయన గుణశేఖర్ అసలు పట్టించుకోవడమే మానేశాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.