Singer Sunitha Husband Ram: పాపం సింగర్ సునీత భర్త.. రెండు కోట్లు మోసపోయాడు

మ్యాంగో రామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కంపెనీ కోట్లకు ఎదిగింది. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర సినిమా రంగాలకు చెందిన వారి ప్రమోషన్లు కూడా ఈ సంస్థ చేస్తోంది. సినిమాలకు సంబంధించి డిజిటల్ ప్రమోషన్లు కూడా చేపడుతోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తోంది. త్వరలో ఈ సంస్థ ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written By: Bhaskar, Updated On : July 22, 2023 4:33 pm

Singer Sunitha Husband Ram

Follow us on

Singer Sunitha Husband Ram: మ్యాంగో రామ్.. అలియాస్ సింగర్ సునీత భర్త.. మ్యాంగో మీడియా పేరుతో ఒక డిజిటల్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీ ప్రమోషన్లు చేస్తుంది. సినిమాలకు సంబంధించి డిజిటల్ ప్రమోషన్లు చేస్తుంది. ఇటీవల ఆడియో రైట్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన బ్రో అనే సినిమాకు సంబంధించి కూడా ఆడియో రైట్స్ ఈ మ్యాంగో సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో వందల మంది పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాలకు సంబంధించి అన్ని ప్లాట్ ఫారం లలో ఈ కంపెనీ దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది. అలాంటి ఈ సంస్థకు సంబంధించి ఒక మోసం ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రెండు కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు

మ్యాంగో రామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కంపెనీ కోట్లకు ఎదిగింది. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర సినిమా రంగాలకు చెందిన వారి ప్రమోషన్లు కూడా ఈ సంస్థ చేస్తోంది. సినిమాలకు సంబంధించి డిజిటల్ ప్రమోషన్లు కూడా చేపడుతోంది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తోంది. త్వరలో ఈ సంస్థ ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీకి ఇటీవల పేరు పొందిన ఒక తెలుగు హీరో తన సినిమా ప్రమోషన్లకు సంబంధించిన పనులు చేసి పెట్టాలని రెండు కోట్లు ఇచ్చాడు. ఆ నగదును చెక్కు రూపంలో మ్యాంగో సంస్థలో పనిచేసే ఒక కీలక ఉద్యోగికి సదరు హీరో ఇచ్చాడు. అయితే ఈ చెక్కును మ్యాంగో కంపెనీ ఖాతాలో కాకుండా తన సొంత ఖాతాలో వేసుకున్నాడు. ఆ నగదుతో ఇల్లు, కారు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశాడు.

ఇలా బయటపడింది

రెండు కోట్లు తీసుకున్నప్పటికీ తన సినిమా ప్రమోషన్ వర్క్ చేయకపోవడంతో ఆ హీరో రామ్ ను సంప్రదించాడు. దీంతో రామ్ ఈ విషయం గురించి కూపీ లాగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ ఉద్యోగి చేసిన మోసం వల్ల రామ్ సదరు హీరో ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భోగట్టా.. సంస్థకు రావలసిన రెండు కోట్లను తన సొంత ఖాతాకు మళ్ళించుకున్న నేపథ్యంలో.. ఆ ఉద్యోగి పై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు రామ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఆ ఉద్యోగి రెండు కోట్లు మాత్రమే తన సొంత ఖాతాలోకి వేసుకున్నాడా? లేక ఇంకా ఎవరినైనా మోసం చేశాడా? అనే కోణంలో రామ్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాంగో ను వందలాది మందికి ఉపాధి కల్పించే అభివృద్ధి చేసిన రామ్ ను సొంత ఉద్యోగి రెండు కోట్లకు మోసం చేయడం పట్ల ఇండస్ట్రీవర్గాలు ఆశ్రయం వ్యక్తం చేస్తున్నాయి. మరి దీనిపై రామ్ ఇంతవరకూ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. సంస్థ క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇంటర్నల్ గా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.