https://oktelugu.com/

జానీ మాస్టర్ మాటలకు తెగ ఫీల్ ఆయిన అనసూయ !

టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రఫర్స్ లో జానీ మాస్టర్ కూడా ఒకడు. డీ అనే షోతో తన టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో కూడా బాగానే అవకాశాలను అందుకున్నాడు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఓ ఊపు ఊపేసిన రౌడీ బేబీ సాంగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ లో ఎక్కువుగా జానీ మాస్టర్ భాగం కూడా ఉంది. పైగా మన సౌత్ నార్త్ తో పాటు దేశాలు, ఖండాంతరాలు దాటి.. ఎక్కడో జపాన్ ప్రేక్షకులను కూడా […]

Written By:
  • admin
  • , Updated On : October 22, 2020 / 03:19 PM IST
    Follow us on


    టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రఫర్స్ లో జానీ మాస్టర్ కూడా ఒకడు. డీ అనే షోతో తన టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో కూడా బాగానే అవకాశాలను అందుకున్నాడు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఓ ఊపు ఊపేసిన రౌడీ బేబీ సాంగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ లో ఎక్కువుగా జానీ మాస్టర్ భాగం కూడా ఉంది. పైగా మన సౌత్ నార్త్ తో పాటు దేశాలు, ఖండాంతరాలు దాటి.. ఎక్కడో జపాన్ ప్రేక్షకులను కూడా అలరించిన బుట్టబొమ్మ సాంగ్ ను క్రియేట్ చేసింది జానీ మాస్టరే. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ లోని స్టెప్స్ అండ్ సెటప్ ఓ రేంజ్ లో అలరిస్తాయి. దానికి తోడు స్టైలీష్ స్టార్‌కు మరింత స్టైలీష్ నెస్ ను తీసుకొచ్చి బన్నీ చేత క్లాస్ స్టెప్స్ లను కంపోజ్ చేసి మొత్తానికి ఆ సాంగ్ తో టాప్ కొరియోగ్రఫర్ గా ప్రస్తుతం ఓ వెలుగు వెలిగిపోతున్నాడు.

    Also Read: రాజమౌళి మళ్లీ లేట్.. ఎన్టీఆర్ చెప్పినట్టే జరిగిందిగా..!

    మరి అలాంటి జానీ మాస్టర్ అమ్మాయిగా మారిపోతే ఎలా ఉంటుంది. పైగా అచ్చం అమ్మాయిలా ఓ మాస్ పాటకు, మాస్ మూమెంట్స్ వెస్తే ఎలా ఉంటుంది. ఓ రేంజ్ లో అదిరిపోతుంది. తాజాగా జీ తెలుగు ఛానెల్ లోని ఓ షో కోసం జానీ మాస్టర్ లేడీ గెటప్ వేసుకుని అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. నిజానికి ఒక టాప్ మాస్టర్, ఒక స్టార్ కొరియోగ్రాఫర్‌కు లేడీ గెటప్ వేసుకుని డ్యాన్స్ చేయాల్సిన అవరసం లేకపోయినా.. షో కోసం జానీ మాస్టర్ బాగానే కష్టపడ్డాడు. అన్నిటికీ మించి సాంగ్ కోసం ఏకంగా మీసం, గడ్డాలు తీసేసి మరి డాన్స్ చేశాడు. ఏది ఏమైనా జీ తెలుగు దసరా ఈవెంట్ కోసం జీ నిర్వహకులు బాగానే ప్లాన్ చేశారు.

    Also Read: ఆగిన మహేష్ ‘సర్కారు వారి పాట’.. ఆందోళనలో డైరెక్టర్..!

    తాజాగా వదిలిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను చూస్తుంటే.. అని రకాల ఎమోషన్స్ ను యాడ్ చేసి వదిలినట్టు ఉన్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్‌ ఢీ ఫేమ్ డ్యాన్సర్ పండు చోలికే పీచే క్యా హై అంటూ లేడి గెటప్‌లో వచ్చి చేసిన హడావుడి.. చివర్లో ఆడవాళ్ళ గురించి చెప్పిన మాటలు బాగున్నాయి. మాదేముంది ప్యాంట్ చొక్కా వేసేసుకుని అలా ఇలా స్టెప్పులేస్తాం.. కానీ ఆడవాళ్లే గ్రేట్ అంటూ సలామ్ కొట్టేశాడు. ఇలా జానీ మాస్టర్ ఆడవాళ్ల గురించి గొప్పగా చెప్పడంతో అనసూయ కూడా తెగ ఫీల్ అయిపొయింది. అసలు ఆ లేడీ గెటప్ లో ఉంది జానీ మాస్టర్ అని మొదట్లో ఎవ్వరూ గుర్తు పట్టలేదు. అంత బాగా మేకప్ వేసి మరీ, ఆ గెటప్ కి సూట్ అయాడు జానీ మాస్టర్.