https://oktelugu.com/

ఎఫ్-2కు జాతీయ అవార్డు.. ఫ్రస్టేషన్ ఎందుకంట?

విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్-2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్-2మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 2018 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ ఆ సీజన్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. Also Read: జానీ మాస్టర్ మాటలకు తెగ ఫీల్ ఆయిన అనసూయ ! ఫ్యామిలీ ఎంటటైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో వెంకటేష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 3:57 pm
    Follow us on

    National Award for F2

    విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్-2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్-2మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 2018 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ ఆ సీజన్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

    Also Read: జానీ మాస్టర్ మాటలకు తెగ ఫీల్ ఆయిన అనసూయ !

    ఫ్యామిలీ ఎంటటైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో వెంకటేష్ కు జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఎఫ్-2కు అనిల్ రావుపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యహరించాడు.

    తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డు రావడంపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 2019 సంవత్సరానికి గానూ వివిధ భాషలకు చెందిన 26సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియన్ పనోరమ అవార్డుకు ఎఫ్-2 సినిమా ఎంపికైంది. ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా ఎఫ్-2 నిలువడం విశేషం

    ఎఫ్-2 మూవీ జాతీయ అవార్డు సాధించడం చిత్రయూనిట్ తోపాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ అవార్డుపై పెదవి విరుస్తున్నారు. 2019లో తెలుగులో ఎఫ్-2 కంటే మంచి చిత్రాలు వచ్చాయని చెబుతున్నారు. అదే ఏడాది విడుదల ‘జెర్సీ’ మంచి ఎమోషనల్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిందని గుర్తు చేస్తున్నారు. దీనిని అవార్డు కమిటీ గుర్తించకపోవడంపై నెటిజన్లు ఫ్రస్టేషన్ అవుతున్నారు.

    Also Read: ‘బిగ్ బాస్’కు షాకిస్తున్న రేటింగ్స్..!

    ఇదిలా ఉంటే జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకులంతా ఆ తర్వాత కనుమరుగు అవుతుండటంపై పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో జాతీయ అవార్డు తెచ్చుకున్న సతీష్ వేగ్నేశ్న.. తరుణ్ భాస్కర్ లకు ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే పలుకరించాయి. దీంతో అనిల్ రావిపూడి కూడా వారి బాటలోనే వెళుతారా అనే చర్చ జరుగుతోంది. కాగా అనిల్ రావుపూడి ఎఫ్-2 సిక్వెల్ గా ఎఫ్-3ను తీసేందుకు రెడీ అవుతున్నాడు.