https://oktelugu.com/

‘నయనతార’లా జాన్వీ కపూర్ మెప్పిస్తోందా ?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన కెరీర్ ని రీమేక్ తోనే మొదలుపెట్టి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఘోస్ట్, గుంజన్ సక్సేనా వంటి స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసినా.. మొదటి సినిమాకి వచ్చిన క్రేజ్ అయితే రాలేదు. అందుకే ఈ సారి తనకు కలిసొచ్చినా రీమేక్ వైపే మొగ్గు చూపుతుంది. తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “కోలమవు కోకిల” అనే సినిమాని హిందీలో కొంచెం భారీ స్థాయిలోనే రీమేక్ […]

Written By:
  • admin
  • , Updated On : December 1, 2020 / 04:03 PM IST
    Follow us on


    అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన కెరీర్ ని రీమేక్ తోనే మొదలుపెట్టి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఘోస్ట్, గుంజన్ సక్సేనా వంటి స్ట్రయిట్ హిందీ సినిమాలు చేసినా.. మొదటి సినిమాకి వచ్చిన క్రేజ్ అయితే రాలేదు. అందుకే ఈ సారి తనకు కలిసొచ్చినా రీమేక్ వైపే మొగ్గు చూపుతుంది. తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “కోలమవు కోకిల” అనే సినిమాని హిందీలో కొంచెం భారీ స్థాయిలోనే రీమేక్ చేయడానికి ప్లాన్ చేశారు.

    Also Read: కలెక్టర్ తో బాలయ్య బాబు లవ్ స్టోరీ !

    కాగా జనవరిలో షూటింగ్ మొదలుకానున్న ఈ రీమేక్ సినిమాలో నయనతార పాత్రని జాన్వీ కపూర్ పోషించనుంది. మరి నయనతార లాంటి సీనియర్ బ్యూటీ చేసిన పాత్రలో.. జాన్వీ లాంటి యంగ్ హీరోయిన్ ఎలా ఉంటుందో చూడాలి. గ్లామర్ పరంగా నయనతారకు తగ్గ స్థాయిలో జాన్వీ రెచ్చిపోయినా.. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో అసలు నయనతారను జాన్వీ బీట్ చేయగలదా.. కథ పరంగా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. మరి ఈ పాత్రను జాన్వీ ఏ స్థాయిలో రక్తికట్టిస్తోందో చూడాలి.

    Also Read: చిరు లేకుండానే షూట్ చేసేశారు !

    ఇక ఆనంద్ రాయ్ నిర్మించే ఈ సినిమాకి సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించబోతున్నాడు. సినిమా మొత్తం పంజాబ్ లో జరగనుంది కాబట్టి.. కథలో మార్పులు చేయబోతున్నారు. అన్నట్లు ఈ కథ నేపథ్యం డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. నయనతారకి లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ రావడానికి ఈ సినిమా కూడా ఒక కారణం. మరి అలాంటి ఇమేజ్ జాన్వీకి బాలీవుడ్ లో కూడా వస్తోందేమో చూడాలి. మరి ఈ పాత్రని ఎలా మెప్పిస్తుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్