Prabhas: ప్రభాస్ కొత్త సినిమాలో స్టార్ హీరోయిన్…ఈ అమ్మడు అదృష్టం అసలు మామూలుగా లేదుగా…

హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు అయితే ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : April 25, 2024 4:39 pm

Janhvi Kapoor to play a heroine in Prabhas Movie

Follow us on

Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుతూ వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం కల్కి, రాజసాబ్ అనే రెండు సినిమాలు రిలీజ్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమాలు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు.అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు అయితే ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమె నటించిన సినిమా ఇప్పటివరకు ఒక్కటి కూడా రిలీజ్ అవ్వనప్పటికీ దేవర సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేస్తోంది. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హను రాఘవవూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా తను హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని హను రాఘవవూడి కూడా స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో జాన్వీ కపూర్ కూడా సక్సెస్ సాధిస్తే తన కెరియర్ లో టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ప్రభాస్ ఇప్పటికే కల్కి, రాజాసాబ్ అనే సినిమాలతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ లు కొట్టి తనకంటూ ఉన్న ఇమేజ్ ని మరింత పటిష్టం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కల్కి సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…