Janhvi Kapoor: జాన్వీ కపూర్ హాట్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఈ యంగ్ బ్యూటీ అందాల విందులో మొహమాటం వదిలేసింది. వారసత్వంగా సంక్రమించిన సోయగాలు బిడియం లేకుండా బయటపెడుతోంది. జాన్వీ అందాలకు అలవాటు పడ్డ కుర్రాళ్ళు పిచ్చోళ్ళై ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతున్నారు. తాజాగా జాన్వీ టూ పీస్ బికీనీలో బోల్డ్ నెస్ కి తెరలేపారు. అర్ధనగ్నంగా తయారై గుండెలు బేజారు చేశారు. జాన్వీ ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలు స్పష్టంగా కనిపిస్తుంటే అభిమానులు జూమ్ చేసి మరీ చూస్తున్నారు. పిచ్చ ఎంటర్టైన్ అవుతున్నారు.

జాన్వీ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె దెబ్బకు ఇంటర్నెట్ స్తంభించి పోయిందంటే నమ్మండి. ఇంస్టాగ్రామ్ లో జాన్వీని 20 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. జాన్వీ ఇలా హాట్ ఫోటోలు షేర్ చేయడానికి కారణం… అదో ఆదాయ వనరుగా మారింది. ఈ మధ్య అందాల తారలు గ్లామర్ షోతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు.
ఇంస్టాగ్రామ్ లో వచ్చే ఆదాయం నా కారు ఈఎంఐ కట్టుకోవడానికి వస్తుదంటూ జాన్వీ నేరుగా చెప్పడం విశేషం. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ తెలుగులో మూవీ చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. శ్రీదేవి అభిమానులు ఆ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను సిద్ధంగా ఉన్నానని జాన్వీ చెప్తున్నారు. ఇటీవల మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ తో నటిస్తారా? ఆఫర్ వస్తే మీ ఫీలింగ్ ఏమిటని? మీడియా వాళ్ళు ప్రశ్నించారు.

ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోను. తెలుగులో నటించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని శ్రీదేవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. సౌత్ లో నటించడం జాన్వీకి ఇష్టం లేదని గతంలో ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను జాన్వీ ఖండించారు.
ఇక ధడక్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి జాన్వీ పరిచయమయ్యారు. 2018లో విడుదలైన ధడక్ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే జాన్వీకి ఇమేజ్ తెచ్చిపెట్టే మూవీ ఇంకా పడలేదు. ఒక్క భారీ కమర్షియల్ హిట్ కూడా తగల్లేదు. ఆమె సినిమాల ఎంపిక కూడా దీనికి కారణం. గాడ్ ఫాదర్స్ ఉన్నప్పటికీ జాన్వీకి స్టార్స్ పక్కన ఆఫర్స్ రాకపోవడం గమనార్హం.
