Jersey: తెలుగు సినిమా అగ్ర నిర్మాతలు ‘దిల్ రాజు, అల్లు అరవింద్’ కలిసి ఒక హిందీ సినిమాను నిర్మించారు. పైగా నాని హీరోగా వచ్చిన “జెర్సీ” సినిమాకి అది రీమేక్. అందుకే, ఈ సినిమా పై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. కాబట్టి ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నేడు విడుదలైన ఈ చిత్రంపై నాని ట్విటర్‌లో స్పందించాడు.

నాని మాటల్లోనే.. ‘నేను జెర్సీ చూశాను. గౌతమ్ తిన్ననూరి మరోసారి హిట్ కొట్టాడు. షాహిద్‌కపూర్, మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్, రోనిత్ (చైల్డ్ యాక్టర్) మనసు పెట్టి నటించారు. ఇది నిజమైన మంచి సినిమా. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి బాలీవుడ్ లో ఇప్పుడు ఏ హిందీ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా లేవు అనుకున్నారు. కానీ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
Also Read: Janhvi Kapoor: విజయ్ దేవరకొండతో చెయ్యట్లేదు.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
మొత్తమ్మీద షాహిద్ కపూర్ మరో భారీ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్ గత సినిమా ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో అద్భుత విజయం సాధించింది. ఏకంగా ఆ సినిమా 300 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.ఇప్పుడు జెర్సీ సినిమా అంతకు మించి కలెక్షన్స్ ను రాబట్టేలా ఉంది. నిజానికి “జెర్సీ”కి భారీ కలెక్షన్స్ వస్తాయా ? భయపడ్డారు కూడా.
ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తేనే.. మన తెలుగు నిర్మాతలు అక్కడ నిలబడగలిగేది అని టాలీవుడ్ లో చిన్నపాటి టెన్షన్ ఉంది. కానీ.. జెర్సీ అద్భుత ఓపెనింగ్స్ తో ఆ టెన్షన్ కి చెక్ పెట్టింది. ఇప్పటికే దిల్ రాజ్ బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల నిర్మాణాన్ని ప్లాన్ చేసుకున్నాడు. ఆ సినిమాలకు కూడా జెర్సీ దెబ్బకు ఊపు వచ్చింది.

పైగా “జెర్సీ” సినిమాతో తెలుగు నిర్మాతలకు హిందీలో పట్టు పెరిగింది. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. షాహిద్ కి హీరోయిన్ గా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కనిపించి బాగా ఆకట్టుకుంది.
Also Read:Mike Tyson: వైరల్ వీడియో: విసిగించిన అభిమానిని విమానంలో చితక్కొట్టిన మైక్ టైసన్
Recommended Videos: