https://oktelugu.com/

ఐశ్వర్యారాయ్ కుమార్తెగా జాన్వి కపూర్ !

క్లాసిక్ అండ్ కూల్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ అనంతరం జరగబోయే షూట్ లో జాన్వి కపూర్ కూడా పాల్గొనబోతుందని, ఆమె పాత్ర కళాకారిణి అయిన నందిని పాత్ర అని తెలుస్తోంది. జాన్వి పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా […]

Written By:
  • admin
  • , Updated On : September 24, 2020 / 02:22 PM IST
    Follow us on


    క్లాసిక్ అండ్ కూల్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ అనంతరం జరగబోయే షూట్ లో జాన్వి కపూర్ కూడా పాల్గొనబోతుందని, ఆమె పాత్ర కళాకారిణి అయిన నందిని పాత్ర అని తెలుస్తోంది. జాన్వి పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ఇక నందిని తల్లి పాత్ర అయిన మందాకినీ దేవి పాత్రలో ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

    Also Read: స్టార్ హీరో భారీ డిమాండ్.. బాధలో నిర్మాతలు !

    కాగా సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ తల్లీకూతుళ్ళ పాత్రల కోసం మణిరత్నం కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఐశ్వర్యారాయ్ మందాకినీ దేవి పాత్ర కోసం బరువు కూడా పెరగబోతుందని తెలుస్తోంది. అయితే మందాకినీ దేవి పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని, మొత్తానికి ఐశ్వర్యారాయ్ రోల్ బాగా ఎగ్జైటింగా ఉండబోతుందని సమాచారం. పైగా నందిని పాత్ర వెరీ వైల్డ్ గా కూడా ఉంటుందట. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా పరిధులు దాటేలా ఉండబోతున్నాయని రూమర్స్ వస్తున్నాయి. మణిరత్నం తన కలల సినిమాగా ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

    Also Read: ఓటీటీలో సినిమా ప్లాప్ అయితే డబ్బులు వెనక్కి?

    అన్నట్టు నాట్యంలో భాగంగా వచ్చే కొన్ని సన్నివేశాల్లో కొన్ని రిస్కీ షాట్స్ ను కూడా చేయడానికి జాన్వి కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకు తగ్గట్లుగానే భరత నాట్యం కూడా నేర్చుకుంటుందట. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకి మరో ప్రధాన బలం. అలాగే కళా దర్శకుడిగా తోట తరణి ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నాడు. అన్నిటికీ మించి ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తి, విజయ్ సేతుపతి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. అలాగే త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ నటీమణులు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి మణిరత్నం నుండి భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ రాబోతుంది.