Anubhavinchu Raja Movie Review:
నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళి, నరేన్ తదితరులు;
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
సంగీతం: గోపీ సుందర్;
ఛాయాగ్రహణం: నాగేష్ బానెల్;
కూర్పు: ఛోటా కే ప్రసాద్;
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; ;
విడుదల: 26 నవంబర్ 2021
రాజ్‌తరుణ్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం ‘అనుభవించు రాజా’. పేరులో ఉన్న హుషారు సినిమాలో లేదనేది ముందు నుంచి టాక్ ఉంది. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
బంగారం అలియాస్ రాజు (రాజ్‌తరుణ్) బాగా ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి. అతని తాతయ్య జీవితాన్ని మొత్తం సంపాదనకే అంకితం చేసి చివరకు తనువు చాలిస్తాడు. చాలిస్తే చాలించాడు, కానీ చివరి క్షణాల్లో నువ్వైనా బాగా అనుభవించు మనవడా అంటూ తన లైఫ్ కి ఎండింగ్ కార్డు వేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి బంగారం జల్సారాయుడిగా మారిపోయి అనుభవించడమే తన జీవిత జన్మ హక్కు అన్నట్టు లిఫెన్ యూ లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి ఎలా బయట పడ్డాడు ? ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ప్రథమార్ధం హైదరాబాద్ లో, ద్వితీయార్ధం పక్కా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. రాజ్‌తరుణ్ బంగారం పాత్రలో ఓ జల్సారాయుడిలా చేసిన అల్లరి బాగుంది. డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు ఫర్ఫెక్ట్ న్యాయం చేశాడు.
ఇక హీరోయిన్ పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే కశిష్ ఖాన్ నటన కూడా పరవాలేదనిపిస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Also Read: ‘దృశ్యం2’లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?
ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సీన్స్,
నేపథ్య సంగీతం,
కథ, పాటలు
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
ఈ రొటీన్ కామెడీ డ్రామా.. రెగ్యులర్ వ్యవహారాలతోనే సాగింది. మొత్తమ్మీద ఈ బంగారంగాడిలో పెద్దగా మెరుపుల్లేవు. ఈ సినిమా చూడక్కర్లేదు.
oktelugu.com రేటింగ్ 2/5
Also Read: వామ్మో ఆ హగ్గులేంటి.. పబ్లిక్ గా సిరి పరువు తీసిన తల్లి!