Janakiram Son: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి భారీ క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో నందమూరి ఫ్యామిలీ హీరోలు మొదటి స్థానంలో ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా వాళ్ళు భారీ విజయాలను దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…
Also Read: బుజ్జిగాడు లో ఆ హీరో క్యామియో రోల్ పడి ఉంటే ఇండస్ట్రీ షేక్ అయ్యేదా..?
విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి తమ సేవలను అందిస్తూ ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వారసులు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు ఆయన చిన్న ఎన్టీఆర్ సైతం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలోని ఒక కార్యక్రమాన్నీ నిర్వహించి సినిమా విశేషాలు చెప్పారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాని గ్రాండ్ లాంచ్ అయితే చేశారు. ఈ ఈవెంట్ కి నారా చంద్రబాబు నాయుడు సతీమణి అయిన నారా భువనేశ్వరి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఎన్టీఆర్ సినిమా చేసి స్టార్ హీరోగా మారతాడా? ఒకవేళ అతను స్టార్ హీరోగా మారితే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ కెరీర్ కి ఏదైనా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ఇక మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ మూడోవతరం హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకముందే నాలుగో తరం హీరోగా ఎన్టీఆర్ తన సత్తా చాటడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.మరి ఈయన మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా మారి మోక్షజ్ఞ (Mokshagna) కి పోటీ ఇస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…
తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వీళ్ళు అనుకున్నట్టుగా సక్సెస్ సాధించి నందమూరి ఫ్యామిలీ నవ తరం కూడా ఇండస్ట్రీని ఏలాడానికి సిద్ధం అవుతున్నారు అనే విషయాన్ని స్పష్టం చేస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
వైవిఎస్ చౌదరి (YVS Choudary) ఇంతకుముందు చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ముఖ్యంగా దేవదాసు సినిమాతో రామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా అతన్ని స్టార్ హీరోగా మార్చడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఇక మెగా మేనల్లుడు ఆయన సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ను సైతం ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఆయన సుప్రీం హీరోగా మారడానికి కొంతవరకు హెల్ప్ అయితే చేశాడు…