Maruti : ఇన్నాళ్లూ తక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొన్న మారుతి సుజుకి ఇండియా ఇప్పుడు తన కార్లలో సేఫ్టీ పై బాగా ఫోకస్ పెంచింది. ఇకపై తన చిన్న కార్లలో కూడా 5 ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో మారుతి అరీనాలో దొరికే వ్యాగన్‌ఆర్, ఆల్టో కే10, సెలెరియో, ఈకో లాంటి కార్లు కూడా ఉన్నాయి.
Also Read: భారత్ – పాక్ “ఇమీడియట్ సీజ్ ఫైర్” .. ట్రంప్ ఏం చేసి ఉంటాడు?
ప్రతి కార్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్
మారుతి సుజుకి ఇండియా సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇకపై తన ప్రతి చిన్న కార్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా రానున్నాయి. అంటే మీరు ఏ కారు బేస్ మోడల్ తీసుకున్నా అందులో తప్పకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇది కార్ల సేఫ్టీ ఫీచర్లలో లేటెస్ట్ అడిషన్.
కంపెనీ కార్ల సేఫ్టీపై తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో కార్ సేఫ్టీకి పెరుగుతున్న డిమాండ్‌ను, కస్టమర్లలో పెరుగుతున్న అవగాహనను చూపిస్తుంది. అంతేకాదు మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మారాలనే కంపెనీ నిబద్ధతను కూడా తెలియజేస్తుంది.
మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ, ఇండియాలో వేగంగా ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు పెరుగుతున్నాయని అన్నారు. దీని వల్ల కార్లలో ముందు లేనంత సేఫ్టీ ఫీచర్ల అవసరం ఏర్పడిందన్నారు. అందుకే కంపెనీ ఇప్పుడు వ్యాగన్‌ఆర్, ఆల్టో కే10, సెలెరియో, ఈకోలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు.
కంపెనీ తన అరీనా నెట్‌వర్క్ ద్వారా వ్యాగన్‌ఆర్, ఆల్టో కే10, సెలెరియో, ఈకో లాంటి మోడళ్లను అమ్ముతోంది. నెక్సా నెట్‌వర్క్ ద్వారా బలనో, గ్రాండ్ విటారా, ఇన్విక్టో లాంటి ప్రీమియం మోడళ్లను అమ్ముతోంది. నెక్సా బ్రాండ్ కింద అమ్ముడయ్యే కార్లలో చాలా మోడళ్లలో ఇదివరకే 6 ఎయిర్‌బ్యాగ్ ఫెసిలిటీ ఉంది.
Also Read : ఆరు నెలల్లోనే 94 వేలకు పైగా అమ్మకాలు.. ధర కూడా అంతంతే.. ఈ ఫెవరెట్ కారు గురించి తెలుసుకుందామా?
ఇకపై ఈ 5 సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరి
6 ఎయిర్‌బ్యాగ్‌లు చేరడంతో ఇకపై మారుతి సుజుకి కార్లలో కస్టమర్లకు 5 తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ ఫీచర్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), హిల్ హోల్డ్ అసిస్ట్. వీటితో పాటు మారుతి కార్లలో 3-పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయి.