Bujjigadu : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ (Prabhas)… ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే బాహుబలి (Bahubali) సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి వచ్చిన ప్రతి సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ కి కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు రాబోతున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి యావత్ వరల్డ్ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ప్రభాస్ హీరోగా, త్రిష (Thrisha) హీరోయిన్ గా వచ్చిన బుజ్జిగాడు (Bujjigaadu) సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ను ఇవ్వడమే కాకుండా తన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిందనే చెప్పాలి. ప్రభాస్ నటన బుజ్జిగాడు కు ముందు బుజ్జిగాడు తర్వాత అనే రేంజ్ లో మారిపోయింది. పూరి జగన్నాథ్ ఈ సినిమా సమయంలో ఒక చిన్న క్యామియో రోల్ లో మహేష్ బాబు కనిపిస్తే బాగుంటుంది అనుకున్నారట.
దానికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అప్పుడున్న పరిస్థితులను బట్టి మహేష్ క్యామియో చేస్తే ప్రభాస్, మహేష్ అభిమానుల మధ్య ఏదైనా విభేదాలు రావచ్చు అనే ఉద్దేశంతో ఆయన పూరి చివర్లో డ్రాప్ అయ్యారట. అది కనక వర్కౌట్ అయి ఉంటే అది ఒక బెస్ట్ క్యామియో గా మిగిలేది అంటూ మహేష్ బాబు(Mahesh Babu), ప్రభాస్ (Prabhas) అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.
అప్పట్లోనే ఆ క్యామియో పడి ఉంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న క్యామియో లేవి దాని ముందు అసలు పని చేసేవే కాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… పూరి జగన్నాథ్ కమర్షియల్ సినిమాలను చేయడంలో దిట్ట. ఆయన చేసిన చాలా సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?