Chiranjeevi : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన డాన్స్ తో, స్టైల్ తో ప్రేక్షకులందరిని మెప్పించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి… ఇప్పటికి ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు…70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 40 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ముందుకు సాగుతున్న నటుడు చిరంజీవి(Chitanjeevi)… ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయానే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ప్రస్తుతం వశిష్ట (Vashishta) డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ ని కేటాయించాడు. అయితే ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపద్యంలో ఇప్పుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోతున్న సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. మరి ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి (Chiranjeevi) లుక్ మనకు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అనిల్ రావిపూడి ఏ హీరోకి తగ్గ మేనరిజమ్స్ ని ఆ హీరోకి సెట్ చేసి పెడుతూ ఉంటాడు. మరి చిరంజీవికి తగ్గట్టుగా ఎలాంటి మేనరిజమ్స్ ను పెట్టాడు. ఈ సినిమాతో అనిల్ మెగాస్టార్ అభిమానులను ఆకట్టుకుంటాడా? లేదా అనే విషయాల్లో సైతం ఒక క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది… ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇప్పటివరకు తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాడు, వాటికి ప్రాణం కూడా పోశాడు. కానీ ఒక్క పాత్రలో మాత్రం ఆయన ఇప్పటివరకు కనిపించలేదు అదే సూపర్ మేన్ గా పాత్ర… ఈ ఒక్క క్యారెక్టర్ తను చేస్తే చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిరంజీవి ఎప్పటికప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవి కమర్షియల్ సినిమాలే కావడం వల్ల ఆయన అలాంటి సినిమాలనే ఎక్కువ చేస్తూ వచ్చాడు. ఇక ఆయన ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసిన ప్రతిసారి ఆయన చేతులు కాల్చుకున్నాడనే చెప్పాలి… మరి ఇప్పటికైనా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొంతమంది విమర్శకులు సైతం చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా చిరంజీవి కమర్షియల్ సినిమాలే చేస్తుండటం విశేషం…
Also Read : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి రక్తంతో తడిపేశారు..ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందా..?