Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ అడ్డంకులను విజయవంతంగా ఛేదించి , ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఈ సినిమా విడుదలకు సరిగ్గా 3 రోజుల సమయం మాత్రమే ఉంది అన్నమాట. విడుదలకు ముందే పైరసీ జరిగినా , రీమేక్ అనే ముద్ర పడినా, ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ లో క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. విజయ్ మేనియా కేవలం సౌత్ ఇండస్ట్రీ కి పరిమితం అయ్యిందని అనుకుంటే పొరపాటే, నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం , ఈ చిత్రానికి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అట. దీని ద్వారా ఇప్పటి వరకు 60 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది.
విడుదలకు మూడు రోజులకు ముందు ఈ రేంజ్ లో ఉండడం చిన్న విషయం కాదు. బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా అలవాటు అయినటువంటి రామ్ చరణ్ , ప్రభాస్ వంటి వారికే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ మధ్య కాలం లో జరగలేదు. దీనిని బట్టీ చూస్తుంటే , ఈ చిత్రానికి కచ్చితంగా 10 కోట్ల రూపాయిల రేంజ్ లో హిందీ నుండి నెట్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. విజయ్ కి కంచుకోట గా పిలవబడే ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఇది విజయ్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.
ఇక ఆ తర్వాత తమిళనాడు ప్రాంతం నుండి 5 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక నుండి 4 కోట్ల 10 లక్షలు , కేరళ నుండి 2 కోట్ల రూపాయిలు, నార్త్ ఇండియా నుండి 60 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 23 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చాయి. చివరి ఈ మూడు రోజుల్లో ఇంకా ఎంత గ్రాస్ వసూళ్లు వస్తాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వసూళ్లు కష్టమేనని అనిపిస్తోంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం , ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయి.


