Also Read: పేరు మార్చుకున్న యాంకర్ రష్మీ.. ఏం పేరు పెట్టుకుందో తెలిస్తే షాకే..
‘అవతార్’ మూవీ ఘన విజయం సాధించిన వెంటనే దర్శకుడు కామరెన్ ఈ చిత్రాన్ని సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు. ‘అవతార్-2’ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే డిసెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు కామెరెన్ సన్నహాలు చేస్తున్నాడు. ‘అవతార్ 2’లో అండర్‌వాటర్ సీన్లు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు కామెరెన్ తాజాగా ప్రకటించాడు. ఆ సీన్లు తీయడానికి కొన్ని నెలలు యూనిట్ సభ్యులంతా బాగా కష్టపడ్డారని తెలిపాడు.
కరోనా కారణంగా నాలుగు నెలల సమయం వృథా అయినట్లు కామెరెన్ తెలిపాడు. కరోనా పరిస్థితుల్లోనూ తాజాగా ‘అవతార్-3’ షూటింగును ప్రారంభించారు. ఇప్పటికే ‘అవతార్-3’ షూటింగ్ 95శాతం పూర్తయింది. మరో ఐదుశాతం షూటింగు పెండింగులో ఉందని కామెరెన్ ఓ ఇంటర్య్వ్యూలో తెలిపాడు. ‘అవతార్-2’.. ‘అవతార్-3‘ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలిపాడు. వీఎఫెక్స్, రీరికార్డింగ్, ఇతర పనులు మాత్రం మిగిలి ఉన్నట్లు తెలిపాడు.
Also Read: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సెట్ లో కరోనా !
‘అవతార్’ చిత్రం ప్రారంభానికి ముందే సినిమా ఐదు భాగాలుగా ఉంటుందని జేమ్స్ తెలిపాడు. ఇప్పటికే మొదటి పార్ట్ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇక రెండో పార్ట్ గా ‘అవతార్-2’ వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవతార్-3’ 2024 డిసెంబర్ 20న.. ‘అవతార్ 4’ను 2026 డిసెంబర్ 18న.. ‘అవతార్ 5’ 2028 డిసెంబర్ 22న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రారంభమైన భారీ బడ్జెట్ చిత్రంగా ‘అవతార్’ రికార్డు సృష్టించడం విశేషం.