https://oktelugu.com/

Surekha Vani Got Emotional On Gayatri’s Death: ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. ప్లీజ్‌ తిరిగి రా – సురేఖా వాణి

Surekha Vani Got Emotional On Gayatri’s Death: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫుల్ గ్లామర్ ఉన్న ఆంటీలకైతే సోషల్ మీడియాలో హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే, టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘సురేఖా వాణి’ ఒకరు. ఏజ్ అయిపోయినా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. సోషల్ మీడియాలో నిత్యం […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2022 / 03:05 PM IST
    Follow us on

    Surekha Vani Got Emotional On Gayatri’s Death: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫుల్ గ్లామర్ ఉన్న ఆంటీలకైతే సోషల్ మీడియాలో హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే, టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘సురేఖా వాణి’ ఒకరు. ఏజ్ అయిపోయినా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. సోషల్ మీడియాలో నిత్యం కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తూ మేకర్స్ కి తానేంటో చూపిస్తూ కొత్త అవకాలను అందుకుంటుంది సురేఖా.

    అయితే, తాజాగా సురేఖ వాణి పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ‘స్పై గర్ల్‌ఫ్రెండ్‌’ సిరీస్‌ ఫేం, యూట్యూబర్‌ గాయత్రి అలియాస్‌ డాలీ డ్రీకూజ్‌ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. గాయత్రి మరణవార్త తెలుసుకున్న సురేఖావాణి అసలు ఈ వార్తను జీర్ణయించుకోలేకపోయింది.

    Surekha Vani, Gayatri

    ఎందుకంటే.. గాయత్రితో సురేఖవాణికి మంచి అనుబంధం ఉంది. సురేఖావాణి కూడా గాయత్రిని తన రెండో కూతురిలా భావించేది. అలాగే ఆమెను చూసుకునేది కూడా. అందుకే.. గాయత్రి విషయంలో ఆమె చాలా ఫీల్ అవుతుంది. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ.. ‘‘ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది నీకు ? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నీతో నేను ఇంకా ఎన్నో విషయాలు షేర్‌ చేసుకోవాలి గాయత్రీ.

    Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ తో చేస్తున్న సినిమా పై రాజమౌళి క్లారిటీ

    ప్లీజ్‌ గాయత్రి.. తిరిగి రా. , మన ఇద్దరం ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకుందాం. ప్లీజ్‌ తిరిగి రా.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను గాయత్రి..’ అంటూ సురేఖావాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చింది. పాపం హీరోయిన్లకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సురేఖ, ఇలా బాధ పడటం చూడలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు.

    అన్నట్టు త్వరలోనే సురేఖా వాణి మెయిన్ లీడ్ గా ఓ వెబ్ సిరీస్ మొదలవుతుందని తెలుస్తోంది. పైగా ఈ వెబ్ సిరీస్ జీ5 సంస్థలో నిర్మించబోతున్నారట. అంటే ఒక రకంగా ఓటీటీ సినిమా అన్నమాట. మరి వెబ్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా సురేఖా వాణి హీరోయిన్ గానే చేయబోతుందట. ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో కనిపిస్తుంటుంది సురేఖా.

    Also Read: Tollywood Actress: అయ్యో .. ఆ హీరోయిన్ ఇలా అయిపోయిందేమిటి ?

     

    Recommended Video:

    Tags