Vijay Devarakonda : అదేంటి..? విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కి ఎప్పుడు పెళ్లైంది?, అప్పుడే అతనికి కవల పిల్లలు ఏంటి?, రష్మిక తో డేటింగ్ చేస్తున్నాడు అన్నారు, అకస్మాత్తుగా ఈ వార్త ఎలా వచ్చింది?, రష్మిక నే పెళ్లి చేసుకున్నాడా?, లేకపోతే వేరే అమ్మాయిని చేసుకున్నాడా?, అసలు ఏమి జరుగుతుంది అని హెడ్లైన్ చూడగానే మీ అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ విజయ్ దేవరకొండ కి నిజంగా అయితే కవల పిల్లలు లేరు లేండి. ఇది కేవలం ఒక కమర్షియల్ యాడ్ మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవరకొండ రీసెంట్ గానే సత్యం స్టీల్ సంస్థ కు ఒక యాడ్ చేసిపెట్టాడు. ఈ యాడ్ లో ఆయన హాస్పిటల్ లో టెన్షన్ పడుతూ కూర్చుంటారు. ఎదురుగా విజయ్ దేవరకొండ నాన్న, మామయ్య పుట్టబోయే బిడ్డకు ఏమి పేర్లు పెట్టాలి అనే దానిపై వాదన చేసుకుంటూ ఉంటారు.
Also Read : విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఎన్ని పాట్లు పడ్డాడో తెలుసా..? ఆడిషన్ వీడియో వైరల్
ఇంతలోపే ఆపరేషన్ హాల్ నుండి ఇద్దరు నర్సులు చెరో చేతిలో ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళు పెట్టాలనుకున్న ఆ రెండు పేర్లు ఆ ఇద్దరు పిల్లలకు పెడుతారు. ‘రిలేషన్ షిప్స్ బలంగా ఉంటే ఆ దేవుడు మనకి అండగా నిలబడతాడు..అదే విధంగా సత్యం స్టీల్స్ కూడా అంత ధృడమైనది’ అంటూ ఆయన హిందీ లో డైలాగ్స్ చెప్తాడు. ఇది రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అది తెగ వైరల్ గా మారిపోయింది. ఈ కమర్షియల్ యాడ్ లో విజయ్ దేవరకొండ లుక్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. చాలా కాలం తర్వాత ఇలాంటి కూల్స్ లుక్స్ లో విజయ్ దేవరకొండ కనిపించాడని , చాలా బాగున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో కలిసి ‘కింగ్డమ్'(Kingdom Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మే31న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయిలో మేక్ ఓవర్ అయ్యాడు. సినిమా కాన్సెప్ట్ కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు చాలా భిన్నంగా ఉంది. కాబట్టి వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఎదురు చూస్తుంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సూపర్ హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో సక్సెస్ కరువు అయ్యింది. మధ్యలో వచ్చిన టాక్సీ వాలా చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, విజయ్ దేవరకొండ ఎదుగుదలకు ఉపయోగపడలేదు. ఈ సినిమాతో అయినా ఆయన అభిమానుల అంచనాలను అందుకోగలడో లేదో చూద్దాం.
Also Read : రీ రిలీజ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్న అల్లు అర్జున్..పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లోకి ‘ఆర్య 2’