https://oktelugu.com/

Mahesh-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేదో ఎప్పుడో తెలుసా..?

ఇప్పటికే మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన పొడగాటి జుట్టుతో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 3, 2024 / 06:11 PM IST

    Jakkanna is preparing everything to release the first look of the upcoming movie in Mahesh Babu Rajamouli Combo.

    Follow us on

    Mahesh-Rajamouli:

    సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
    ఇక ఇప్పటికే మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన పొడగాటి జుట్టుతో చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. అంటే ఈ లెక్కన ఆయన పొడుగు జుట్టుతో, సిక్స్ ప్యాక్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక రీసెంట్ గా ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ను జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళి రహస్యంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారనే  వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
    ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ను ఈనెల రెండోవ వారంలో నిర్వహించి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మొత్తాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి, ఆర్టిస్టు ఎవరెవరు చేయబోతున్నారు అనే విషయాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు ఈనెల రెండో వారంలో ఆయన తన టీమ్ మొత్తాన్ని పరిచయం చేస్తారట… ఇక ఒక్కసారి రాజమౌళి కనక ప్రెస్ మీట్ ను అరేంజ్ చేసినట్లయితే ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి వెళ్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
    ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన హైప్ ని తరా స్థాయిలో పెంచే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…