Prasanna Vadanam OTT: వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు యంగ్ హీరో సుహాస్. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ మరో నాని అని సుహాన్ ని పొగడటం విశేషం. ఆయన నటించిన మరొక ప్రయోగాత్మక చిత్రం ప్రసన్నవదనం. మే 3న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ప్రసన్నవదనం సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్ర డిజిటల్ రైట్స్ గురించి ఆసక్తికర సమాచారం అందుతుంది.
ప్రసన్నవదనం డిజిటల్ హక్కులు ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆహా చందాదారులకు ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. ప్రసన్నవదనం సైతం జూన్ మొదటివారంలో ఆహా లో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు కలవు.
ప్రసన్న వదనం చిత్ర కథ విషయానికి వస్తే… సూర్య(సుహాస్) ఎఫ్ ఎమ్ స్టేషన్ లో రేడియో జాకీగా పని చేస్తూ ఉంటాడు. సూర్య ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. ఆ ప్రమాదంలో సూర్య కూడా ఉంటాడు. తలకు దెబ్బ తగలడంతో ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన వ్యాధికి గురవుతాడు. ఈ సమస్య వలన సూర్య ఎదుటి వ్యక్తుల ముఖాలు, గొంతులు గుర్తించలేడు. గుర్తు పెట్టుకోలేడు.
అనూహ్యంగా సూర్య ఒక హత్యను చూస్తాడు. ఒక అమ్మాయిని రాత్రి వేళ దారుణంగా చంపడం చూస్తాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ తనకున్న సమస్య వలన సూర్య నిందితులను గుర్తు పట్టలేదు. ఈ హత్య ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రసన్న వదనం చిత్రానికి అర్జున్ వై కే దర్శకుడు. పాయల్ రాధా కృష్ణ, రిషి సింగ్ నందు కీలక రోల్స్ చేశారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.