Christopher Nolan: హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలన్ ను మించిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

క్రిస్టఫర్ నోలన్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో క్రిస్టఫర్ నోలన్ లాంటి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ హాలీవుడ్ లో మరొకరు కూడా ఉన్నారు

Written By: Gopi, Updated On : May 3, 2024 5:49 pm

David Fincher can match Christopher Nolan

Follow us on

Christopher Nolan: హాలీవుడ్ సినిమా చరిత్రలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ భారీ వసూళ్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే క్రిస్టఫర్ నోలన్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో క్రిస్టఫర్ నోలన్ లాంటి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ హాలీవుడ్ లో మరొకరు కూడా ఉన్నారు ఆయనెవరు అంటే డేవిడ్ ఫించర్… ఇక ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఆయన సెవెన్ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. అలాగే ఫేస్ బుక్ ఒరిజినల్ స్టోరీ అయిన “సోషల్ నెట్వర్క్” ని కూడా చాలా సక్సెస్ ఫుల్ గా తీసి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో క్రిస్టఫర్ నోలన్ కి పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది డేవిడ్ ఫించర్ అనే చెప్పాలి.ఈయన సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. అందువల్లే క్రిస్టఫర్ నోలన్ ను కొట్టే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది డేవిడ్ ఫించర్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…అయితే వీళ్లు చేసిన ప్రతి సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా సూపర్ డూపర్ సక్సెస్ లను కూడా సాధిస్తూ వచ్చాయి.

అయితే క్రిస్టోఫర్ నోలన్, డేవిడ్ ఫించర్ ఇద్దరి మధ్య ఒక కామన్ సంబంధమైతే ఉంది. అదేంటంటే ఇద్దరు కూడా డిఫరెంట్ జానర్ లలో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే కూడా ఒక సీన్ ని డైరెక్ట్ చేసేటపుడు ఆ సీన్ తాలూకు ఎమోషన్ ని చాలా డెప్త్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు.

అందువల్లే వీళ్ళిద్దరూ టాప్ లెవల్లో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ డైరెక్టర్లు వాళ్ల సినిమాలతో హాలీవుడ్ స్థాయిని పెంచుతున్నారనే చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో వీళ్లిద్దరి సినిమాలు బాక్సఫీస్ దగ్గర పోటీపడే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ పోటీ పడితే ఎవరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది…