Jailer Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తరాఖండ్ లో ప్రశాంతంగా గడుపుతుంటే ఆయన చిత్రం మాత్రం వరల్డ్ వైడ్ సునామీ సృష్టిస్తుంది. వీకెండ్ ముగిసినా జైలర్ జోరు తగ్గలేదు. 8వ రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం జైలర్ రూ. 1.6 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం హక్కులు కేవలం రూ. 4 కోట్లకు అమ్మారు. 8 రోజులకు జైలర్ మూవీ రూ. 15.4 కోట్ల షేర్ రాబట్టింది. అంటే కొన్న దానికి నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసింది.
ఇక వరల్డ్ వైడ్ రూ. 9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఎనిమిది రోజులకు గానూ రూ. 217 కోట్ల షేర్, రూ. 445 కోట్ల గ్రాస్ జైలర్ వసూలు చేసినట్లు సమాచారం. అనగా ప్రభాస్ సాహో వరల్డ్ వైడ్ వసూళ్లను జైలర్ అధిగమించింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన జైలర్ లాభాలు పంచుతుంది. తెలుగులో చాలా తక్కువ ధరకు జైలర్ హక్కులు విక్రయించారు. దాంతో వారు భారీ లాభాలు ఎంజాయ్ చేస్తున్నారు.
జైలర్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే… తమినాడులో రూ. 62 కోట్లు, ఏపీ/తెలంగాణాలలో రూ. 12 కోట్లు, కర్ణాటకలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 30 కోట్లతో వరల్డ్ వైడ్ రూ. 122.50 కోట్ల బిజినెస్ చేసింది. 8 రోజులకు జైలర్ అంతకు అంత వసూళ్లు సాధించింది. పెట్టుబడికి వంద శాతం లాభాలు బయ్యర్లు పొందారు.
జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు కాగా సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల గెస్ట్ రోల్స్ హైలెట్ గా నిలిచాయి. ఇక తమన్నా సాంగ్ నువ్వు కావాలయ్యా ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. మొత్తంగా రజినీకాంత్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు.