Jailer Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది. హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో జోరు చూపిస్తుంది. ఫస్ట్ డే జైలర్ ఇండియా వైడ్ రూ. 52 కోట్లు వరల్డ్ వైడ్ రూ. 72 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక రెండో రోజు కూడా జైలర్ వసూళ్లు తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా రజినీకాంత్ అభిమానవర్గం నిద్ర లేచింది. థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ వెలుస్తున్నాయి.
రెండో రోజు జైలర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే… తెలుగు వర్షన్ రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక తమిళనాడులో రూ. 18 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రూ. 6 కోట్లు, కేరళలో రూ.3.50 కోట్లు అందుకుంది. రెస్టాఫ్ ఇండియా రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్లో రూ. 15 కోట్లు అందుకుంది. మొత్తంగా జైలర్ సెకండ్ డే రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంకా వీకెండ్ మిగిలే ఉంది. మూడో రోజు కూడా జైలర్ చిత్రానిదే.
రజినీకాంత్ గత చిత్రాల వసూళ్ల ఆధారంగా తక్కువ ధరకే తెలుగులో విక్రయించారు. నైజాంతో పాటు పలు ఏరియాల్లో జైలర్ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేశాడు. ఆయనకు జైలర్ మంచి లాభాలు తెచ్చిపెట్టే సూచనలు కలవు. కొన్ని ఏరియాల్లో రెండో రోజుకే జైలర్ బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 122.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమినాడు రూ. 62 కోట్లు, ఏపీ/తెలంగాణ రూ. 12 కోట్లు, కర్ణాటక రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.5 కోట్లు రెస్టాప్ ఇండియా రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 30 కోట్లకు హక్కులు అమ్మారు.
రెండు రోజుల్లోనే జైలర్ వసూళ్లు వంద కోట్లను దాటేశాయి. జైలర్ భారీ ఫిగర్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ దర్శకుడు. తమన్నా, సునీల్, రమ్య కృష్ణ, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. జైలర్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా బాగా ప్లస్ అయ్యింది.