Jailer 2 : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ (Rajinikanth) లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు.ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. నెల్సన్ (Nelsan) డైరెక్షన్ లో ఇంతకు ముందు వచ్చిన జైలర్ (Jailer) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా వస్తుంది. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్ లను బ్రేక్ చేయబోతుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఈ మూవీతో రజనీకాంత్ మరోసారి తన స్టార్ డమ్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నెల్సన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడమే కాకుండా ఇంటర్వెల్ సీన్ కోసమే దాదాపు 10 కోట్లు పెట్టి ఒక భారీ సెట్ వేసి అందులో భారీ సీన్లు తిరిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రజనీకాంత్ ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించి తన మేనియాను కొనసాగిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రజినీకాంత్ ‘జైలర్ 2’ లో బాలయ్య సైకో పోలీస్ గా కనిపించబోతున్నాడా..?
ఇక ఇండియాలో ఉన్న సీనియర్ హీరోలందరిలో రజనీకాంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే జైలర్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ హిట్ సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కనక మంచి విజయాన్ని సాధిస్తే రజనీకాంత్ కి ఎదురు ఉండదనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి.
ఇకమీదట సాధించబోయే విజయాలు కూడా అతన్ని చాలా గొప్ప స్థానంలో నిలపడమే కాకుండా ఇంతకుముందు చేయనటువంటి కొన్ని మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో రజినీకాంత్ తను అనుకున్న విజయాన్ని సాధిస్తాడా? తద్వారా ఆయన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతాడా లేదా అనేది….