Thug Life : ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. వాళ్లకంటు ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కొన్ని ఆలోచనలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఈ ఏజ్ లో సైతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలను చేస్తున్నాడు…
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘థగ్ లైఫ్'(Thag Life)… ఈ సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మణిరత్నం మరోసారి తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కమల్ హాసన్ సైతం ఒక వినూత్నమైన నటనను ప్రదర్శించి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక శింబు సైతం మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడా? హీరో పాత్ర చేస్తున్నాడా? అనే విషయంలోనూ కొంతవరకు క్లారిటీ రావడం లేదు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో గానే కనిపిస్తున్నప్పటికి అందులో ఒక చిన్నపాటి మెలిక అయితే ఉంటుందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాయి.
Also Read : మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ బడ్జెట్ ఎంతో తెలిస్తే మీ మతి పోతుంది..!
తద్వారా వాళ్లకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. కమల్ హాసన్ వినూత్నమైన పాత్రలో కనిపించి మరోసారి తన నటన ప్రతిభను బయటకు తీయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన చేసిన ‘భారతీయుడు 2’ (Bharatheeyudu 2) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించి భారీగా కం బ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేసిన విక్రమ్ (Vikram) సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వయసున్న క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి పాత్రనే ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుందా? లేదంటే విమర్శలను ఎదుర్కొనే విధంగా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది…