Jailer 2 : కూలీ వంటి యావరేజ్ గ్రాసర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) చేస్తున్న చిత్రం ‘జైలర్ 2′(Jailer 2 Movie). 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘జైలర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ని ఇప్పటికీ మర్చిపోలేరు ఆడియన్స్. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రం 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న రజినీకాంత్ ని గాడిలో పెట్టిన చిత్రమిది. నేటి తరం ఆడియన్స్ కి రజిని స్టామినా ఎలాంటిదో చూపించిన సినిమా ఇది. అలాంటి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ పై మొదటి నుండే అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి. షూటింగ్ పూర్తి అయ్యే సమయం రావడం తో హైప్ ఇంకా పెరిగిపోయింది.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై హాట్ టాపిక్ గా మారింది. జైలర్ మొదటి భాగం లో విలన్ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్. రజినీకాంత్ కి నువ్వా నేనా అనే రేంజ్ పోటీ క్లైమాక్స్ వరకు ఇచ్చాడు. క్లైమాక్స్ లో విలన్ చనిపోయేముందు, నువ్వు నన్ను చంపి చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్, నా వెనుక ఎవరున్నారో నీకు తెలియదు, ఇదొక పెద్ద సామ్రాజ్యం అని అంటాడు గుర్తుందా?, పార్ట్ 2 లో విలన్ ని ఇంకా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారట. ఇక కేవలం ఒక్క విలన్ కాదు, విలన్ ఫ్యామిలీ మొత్తం రజినీకాంత్ తో తలపడబోతున్నారట. మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి ని తీసుకున్నారట. ఇక ఆయన కూతురు పాత్ర లో నేషనల్ అవార్డు విన్నర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించబోతున్నట్టు సమాచారం.
ఇందులో ఆమె చేసేది హీరోయిన్ క్యారక్టర్ కాదు, విలన్ కి కూతురు క్యారక్టర్. ఈమెది కూడా నెగిటివ్ షేడ్ లో ఉంటుందా?, తండ్రి లాగానే క్రూరంగా ఉంటుందా?, లేకపోతే తండ్రి చేసే పనులు నచ్చక హీరో కి సపోర్ట్ గా ఉండే క్యారెక్టర్ లాగా ఉంటుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇకపోతే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో ఆయన కనిపిస్తాడట. అదే విధంగా మొదటి భాగం లో గెస్ట్ రోల్ లో కనిపించిన శివ రాజ్ కుమార్, రెండవ భాగం లో ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేస్తున్నాడట. సినిమా కూడా చాలా బాగా వస్తుందని టాక్, చూడాలి మరి డైరెక్టర్ నెల్సన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది.