Rohit Sharma : రోహిత్ శర్మకు ఫామ్ తో సంబంధం ఉండదు. పిచ్, జట్టు, బౌలర్లతో లెక్క ఉండదు. అతడు వచ్చాడంటే చాలు వేగంగా పరుగులు తీస్తాడు. ఏ మాత్రం భయపడకుండా దూకుడు కొనసాగిస్తాడు. అందువల్లే అతడిని టీమ్ ఇండియాలో హిట్ మాన్ అని పిలుస్తుంటారు. అటువంటి రోహిత్ ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.
ఇంగ్లాండ్ సిరీస్ ముందు తన టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అంతకుముందు t20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో అతడు ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఫార్మాట్ నుంచి కూడా అతడిని నాయకుడిగా తప్పించింది మేనేజ్మెంట్. అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ మాత్రమే అదరగొట్టాడు. అతని ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. దీంతో అతడు మ్యాన్ అఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకున్నాడు. మూడో వన్డేలో రోహిత్ సెంచరీ చేయడం ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
భారత జట్టు తరుపున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ 15787 పరుగులు చేయగా.. ఆ తర్వాత స్థానంలో 15758 పరుగులతో వీరేంద్ర సెహ్వాగా ఉన్నాడు. 15335 పరుగులతో సచిన్ మిగతా స్థానంలో కొనసాగుతున్నాడు. వాస్తవానికి రోహిత్ శర్మ 2007లోనే టీమ్ ఇండియాకు ఆడటం మొదలు పెట్టాడు. కానీ 2013 వరకు అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అతడికి దూకుడు అలవడింది. అంతేకాదు అతనిలో ఉన్న అసలు సిసలైన వేగవంతమైన కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. దీంతో రోహిత్ హిట్ మాన్ గా అవతరించాడు. ఆస్ట్రేలియా మీద ఏకంగా ద్వి శతకం సాధించాడు. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడి గారికి సృష్టించాడు.. 2013 నుంచి ఇప్పటివరకు రోహిత్ టీమ్ ఇండియాకు ఓపెనర్ గానే ఆడుతున్నాడు. కొన్ని సందర్భాలలో మినహా మిగతా అన్ని రోజుల్లోనూ రోహిత్ ఓపెనర్ గా రంగంలోకి దిగడం విశేషం.