Jailer 2 : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజినీకాంత్(Rajinikanth)… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందిన వాళ్లలో రజనీకాంత్ ఒకరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తమిళంతో పాటు ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యేవి … తద్వారా ఆయనకు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే దక్కింది. ఇప్పటికి ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే తెలుగులో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రేక్షకులందరు అతని సినిమాని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన జైలర్ 2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ (Lokesh Kanaka Raj) డైరెక్షన్ లో చేస్తున్న కూలీ (Cooli) సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆయన నెల్సన్ (Nelsan) డైరెక్షన్లో చేస్తున్న జైలర్ 2 (Jailer 2) సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన జైలర్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా జైలర్ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మరి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ అభిప్రాయాను తెలియజేస్తున్నారు. ఇక జైలర్ సినిమాలో శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి నటులు గెస్ట్ అపీరియన్స్ ఇస్తు ఒక క్యామియో పోషించిన విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళ క్యామియో లకు విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. దానివల్ల జైలర్ 2 (Jailer 2 ) సినిమాలో బాలయ్య బాబు క్యామియో చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘జైలర్ 2’..ఈ వయస్సులో అదేమీ దూకుడు సామీ!
ఇక జైలర్ మొదటి పార్ట్ లో చేసిన మోహన్ లాల్, శివన్న లు జైలర్ 2 లో కూడా క్యామియో రోల్ చేస్తున్నారు. ఇక వీళ్ళతో పాటుగా తెలుగు నుంచి బాలయ్య బాబుని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు కి సంబంధించిన సీన్స్ షూటింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే బాలయ్య బాబు ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మరి ఆయన కనిపించేది చాలా తక్కువ సమయమే అయినప్పటికి అందులో భారీ ఎలివేషన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
జైలర్ మొదటి పార్ట్ లో ఏ విధంగా అయితే శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఇచ్చారో ఇందులో అంతకు మించి ఎలివేషన్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారట. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని, బాలయ్య బాబు ఆ క్యారెక్టర్ లో సింహంలా గర్జిస్తాడా లేదా అనేది తెలియదు.
Also Read : రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్న తెలుగు స్టార్ హీరో…