Jailer 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నా హీరోలందరూ వాళ్ళు చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ (Rajinikanth) ఈ ఏజ్ లో కూడా పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. 2023 వ సంవత్సరంలో వచ్చిన ‘జైలర్’ (Jailer) సినిమాతో పెను రికార్డులను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు రాబోతున్న జైలర్ 2 (Jailer 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక క్యామియో రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ జైలర్ గా తను నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ తమ్ముడిగా బాలయ్య బాబు కల్పించబోతున్నాడట.
Also Read : రజినీకాంత్ ‘జైలర్ 2’ లో బాలయ్య సైకో పోలీస్ గా కనిపించబోతున్నాడా..?
ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయని వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసిన తెలుగు, తమిళ అభిమానులందరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఇప్పటివరకు రజినీకాంత్ – బాలయ్య (Balayya) కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.
మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డ్ లను తిరగరాస్తుందంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం… రజనీకాంత్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే ఉంది.
అందువల్లే ఆయన సినిమాలు తెలుగులో కూడా ఎక్కువ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. ఎంటైర్ ఆయన కెరియర్లో ముత్తు, భాషా, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో, రోబో 2 లాంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ గొప్ప హీరోగా పేరు సంపాదించుకున్న వాళ్లలో రజనీకాంత్ మొదటి స్థానంలో ఉంటాడు. మరి ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘జైలర్ 2’ కోసం బాలయ్య 20 రోజుల డేట్స్ కేటాయింపు..రెమ్యూనరేషన్ ఎంతంటే!