Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆయన మహేష్ బాబ (Mahesh Babu) తో సినిమా చేస్తున్నాడు. అయితే రాజమౌళి మీద బాలీవుడ్ హీరోలు కొంతవరకు కోపంతో ఉన్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కారణమేంటి అంటే ఆయనతో పాన్ ఇండియా సినిమాను చేసి బాలీవుడ్ హీరోలను బీట్ చేసేలా తెలుగు హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చాడు. ఇక దానికి తోడుగా రాజమౌళి కేవలం తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ వాళ్లు కొంతవరకు రాజమౌళి మీద ఫైర్ అవుతున్నారట. అమీర్ ఖాన్ (Ameer Khan) లాంటి హీరో సైతం రాజమౌళి (Rajamouli) ని పిలిపించుకొని తనతో సినిమా చేయమని అడిగినప్పటికి రాజమౌళి తనకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడు సినిమా చేయలేనని తెగేసి చెప్పాడు. అందువల్లే వాళ్ళు రాజమౌళిని ఢీకొట్టే సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి వాళ్లకు సరైన దర్శకుడు అయితే దొరకడం లేదు.
Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…
ఇక రాజమౌళిని ఢీ కొట్టాలి అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఆయన చేసే సినిమాలు అన్నీ ఆయనకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. కాబట్టి అలాంటి దర్శకుడిని ఢీకొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆయన అహర్నిశలు సినిమా కోసమే కష్టపడుతూ సినిమాలో హై ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు.
మరి తనని కనక బీట్ చేసినట్టయితే మాత్రం బాలీవుడ్ హీరోలు దర్శకులు టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. కానీ అతన్ని బీట్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. మరి మొత్తానికైతే రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరోలు తన మీద కోపంతో ఉన్నప్పటికి తను మాత్రం వాళ్లతో సినిమాలు చేయకుండా తెలుగు హీరోలతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఫ్యూచర్లో అయిన రాజమౌళి బాలీవుడ్ హీరోలతో సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…అయితే ఇప్పుడున్న పొజిషన్ లో బాలీవుడ్ హీరోలు సైతం మన తెలుగు దర్శకులతోనే సినిమాలను చేయాల్సిన అవసరం అయితే ఉంది…లేకపోతే మాత్రం వాళ్లకు సక్సెస్ లైతే వచ్చే అవకాశాలు లేవు…