Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘జైలర్'(Jailer Movie). వరుస ఫ్లాప్స్ లో ఉన్న రజినీకాంత్ కెరీర్ కి ఈ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా ‘జైలర్ 2′(Jailer 2 Movie) ని రీసెంట్ గానే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుండి షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒక ముఖ్యమైన క్యారక్టర్ చేస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారంలో ఉంది.
Also Read : జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘జైలర్ 2’..ఈ వయస్సులో అదేమీ దూకుడు సామీ!
ఇది కేవలం ప్రచారం అనే అనుకున్నారు అందరూ. కానీ నిజంగానే ఈ సినిమాలో బాలయ్య బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు అనేది వాస్తవమే అట. ఇది కేవలం అతిథి పాత్ర అనుకుంటే పెద్ద పొరపాటే. సినిమాలో ఒక 40 నిమిషాల పాటు బాలయ్య ఉంటాడట. అందుకోసం ఆయన 20 రోజుల కాల్ షీట్స్ ని రీసెంట్ గానే ఇచ్చాడట. ఈ 20 రోజుల కాల్ షీట్స్ కోసం బాలయ్య బాబు సుమారుగా 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఆయన కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ అని చెప్పొచ్చు. రజినీకాంత్ జైలర్ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ‘జైలర్ 2’ కి సీక్వెల్ హైప్ తో పాటు, బాలయ్య క్రేజ్ కూడా తోడు అయ్యింది. సినిమా హిట్ అయితే కేవలం తెలుగు వెర్షన్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇందులో ఒక వంద కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం బాలయ్య వల్లే వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం లో కేవలం బాలయ్య మాత్రమే కాదు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కూడా నటిస్తున్నారు. వీళ్ళు జైలర్ లో కూడా ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్
కి ముందు శివరాజ్ కుమార్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉన్నిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. థియేటర్స్ లో ఆడియన్స్ ఈలలతో టాప్ లేచిపోయేలా చేశారు. ఇలాంటి మూమెంట్స్ బాలయ్య అభిమానులకు ‘జైలర్ 2’ లో చాలానే ఉంటాయట. ఒక్కసారి ఊహించుకోండి, రజినీకాంత్, బాలయ్య బాబు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో, మూవీ లవర్స్ కి అది ఒక పండగ లాంటి మూమెంట్ అని చెప్పొచ్చు.
Also Read : రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్న తెలుగు స్టార్ హీరో…