Trivikram and Pawan Kalyan : టాలీవుడ్ లో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ కచ్చితంగా ఉంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ కాంబినేషన్ అంటే పిచ్చి ఇష్టం. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాలు వచ్చాయి. జల్సా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది. ఇక ‘అత్తారింటికి దారేది’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే HD ప్రింట్ పైరసీ జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఒక సంచలనం. సినిమాకు భారీ నష్టం వస్తుందని భయపడ్డారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా ఏకంగా అప్పటి ఇండస్ట్రీ మగధీర రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
Also Read : పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన త్రివిక్రమ్…వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందా..?
ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ‘అజ్ఞాత వాసి’ మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. ఆ అంచనాలను ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ చిత్రంగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ చిత్రాలకు మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇదంతా పక్కన పెడితే వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు నాల్గవ సినిమా సిద్ధం అవుతుందట. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసాడు.
రాబోయే రెండు నెలల్లో ఆయన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను కూడా పూర్తి చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నాడు. వాస్తవానికి ఈ మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాత సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అట్టకెక్కింది. దానికి బదులుగా త్రివిక్రమ్ సినిమా రానుంది. ఈ ఏడాది చివర్లో కానీ, లేదా వచ్చే ఏడాది ఆరంభం లో కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో కేవలం ఎంటెర్టైనెర్స్ ని మాత్రమే తీసాడు. కానీ ఈసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కోబలి చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న ఈ సబ్జెక్టు తో ‘అజ్ఞాతవాసి’ బాకీ ని అభిమానులకు తీర్చాలనే కసితో ఉన్నాడు త్రివిక్రమ్.
Also Read : పవన్ అక్కడ.. త్రివిక్రమ్ ఇక్కడ.. పెద్దరికంపై ఫైర్ అవుతున్న సినీ పెద్దలు…