Operation Sindoor: పెహల్గామ్ ఉగ్రదాడులు ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేలా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ప్రతీ కారం గా పాకిస్థాన్ ఆర్మీ ప్రతీ రోజు మన ఇండియా లోని ప్రధాన నగరాలపై మిస్సైల్స్ ప్రయోగిస్తూనే ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క మిస్సైల్ కూడా మన భూ భాగాన్ని ముట్టుకోలేకపోయింది. ప్రతీ మిస్సైల్ ని మన ఇండియా ఆర్మీ గాల్లోనే ద్వంసం చేస్తూ పాకిస్థాన్ కి ముచ్చమటలు పట్టిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ తో కచ్చితంగా భవిష్యత్తులో సినిమాలు వస్తాయని మనమంతా ఊహించాము. కానీ ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇప్పటి వరకు 30 మంది నిర్మాతలు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసుకునేందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పోటీ పడుతున్నారట. నేడు ఒక సంస్థ పోస్టర్ ని కూడా విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది.
Also Read: స్టార్ క్రికెటర్ కి ధీటైన సమాధానం ఇచ్చిన రష్మిక..శభాష్ అంటున్న నెటిజెన్స్!
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) భర్త జాకీ భగ్నానీ నిర్మాణ సంస్థగా పిలవబడే నిక్కి విక్కీ భగ్నానీ ఫిలిమ్స్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఉత్తమ్, నితిన్ అనే నూతన దర్శకులు ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. నేడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక లేడీ జవాన్ ఒక చేతిలో గన్ పట్టుకొని మరో చేతితో నుదిట సిందూరం పెట్టుకుంటూ కనిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే ఈ ఫోటో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘ఆపరేషన్ సింధూర్’ ని నిర్వహించింది సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందుకే ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కుతుంది.
ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బాగా గమనిస్తే హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) లాగా అనిపించింది. ఈమధ్య కాలం లో ఆమె వైవిద్యభరితమైన సినిమాలు చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె కాకుండా హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu) కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో అంతగా సక్సెస్ అవ్వని తాప్సీ, బాలీవుడ్ లో ఇలాంటి వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ ఇద్దరి హీరోయిన్స్ లో ఎవరో ఒకరు ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో ఉన్నవాళ్లు అయ్యుండొచ్చని నెటిజెన్స్ ఊహిస్తున్నారు. మరి అందులో ఎంత వరకు నిజం ఉందో రాబోయే రోజుల్లో చూడాలి. మరో పక్క ఈ టైటిల్ తో సినిమాలు చేసేందుకు జీ స్టూడియోస్, టీ సిరీస్ వంటి ప్రముఖ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. ఇలాంటి సినిమాలు గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.