Jai Bhim Movie: స్టార్ హీరో సూర్య… తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తనదైన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయగలడు సూర్య. గజిని, యముడు, సింగం సినిమాలతో తెలుగు ప్రేక్షకళ్ళకు బాగా దగ్గరయ్యాడు సూర్య. గతేడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు హీరో సూర్య. ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో జై భీమ్ సినిమాలో నటిస్తున్నాడు సూర్య. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.
జై భీమ్ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ లో హీరో సూర్య లాయర్ గెటప్ లో ప్రజల పక్షాన పోరాడుతూ అదరగొట్టడాని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన రాగా… ఈ ట్రైలర్ తో జై భీమ్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ సినిమా కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాను సూర్య మరియు జ్యోతిక లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నారు.ఒక గిరిజన మహిళకు న్యాయం జరగడానికి పరితపించే లాయర్ గా సూర్య ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి.
ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన వారంతా వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రెయిలర్ కి హైలైట్ అని చెప్పాలి. రావు రమేశ్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో ముఖ్యా పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.