Jahnavi Ghattamaneni: సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పుడున్న టాప్ హీరోలందరు వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన వారే కావడం విశేషం…కొన్ని రోజుల క్రితం వరకు ఇండస్ట్రీ లో వారసుల కొడుకులు మనవళ్ళు మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. వారసులతో పాటు వారసురాళ్లు కూడా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన అక్క అయిన మంజుల సైతం హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికి ఆమెకు ఆశించిన మేరకు సక్సెస్ లు రాకపోవడంతో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మారి మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు తన కూతురు అయిన ‘జాన్వి ఘట్టమనేని’ సైతం హాట్ హాట్ పిక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.17 సంవత్సరాల ఈ అమ్మాయి సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.
Also Read: పటిష్టంగా ఆస్ట్రేలియా.. సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా చేయాల్సింది ఇదే!
మరి ఈ ముద్దుగుమ్మ కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ యొక్క గ్రేస్ ఈ అమ్మాయిలో కనిపిస్తోంది. లుక్స్ పరంగా చూసిన కూడా ఆమె ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉండడంతో తను తొందర్లోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… మహేష్ బాబు కోడలు అంటే మినిమం రేంజ్ ఉంటుంది అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…
ప్రస్తుతం మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయ కృష్ణ సైతం ఇండస్ట్రీలో హీరోగా పరిచయమవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ సైతం ప్రస్తుతం యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడు. తొందర్లోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తే ఏ మారకు రాణిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. మంజుల డైరెక్షన్లో వచ్చిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో జాన్వీ ఒక కీలకమైన పాత్రలో నటించింది. నటిగా అప్పుడే మంచి మార్కులను సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారి భారీ విజయాలను సాధించగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…