https://oktelugu.com/

Jagapathi Babu : మంచు లక్ష్మికి జగపతి బాబు మాస్ కౌంటర్..అంత కొవ్వు అక్కర్లేదు అంటూ కామెంట్స్!

డిసెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తర్వాత జగపతి బాబు ఏ సినిమాకి కూడా సంతకం చేయలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2024 / 09:34 PM IST

    Jagapathi Babu mass counter to Manchu Lakshmi

    Follow us on

    Jagapathi Babu : హీరో నుండి విలన్ గా మారిన తర్వాత జగపతి బాబు డిమాండ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో గా ఆయన ఎంత సంపాదించాడో తెలియదు కానీ, విలన్ గా చేసిన ఈ పదేళ్లలో అంతకు మించే డబ్బులు, క్రేజ్ సంపాదించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవార్డులు కూడా ఆయనకీ విలన్ గా మారినప్పుడే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జగపతి బాబు ని విలన్ గా చూపించాలనే బోయపాటి శ్రీను ఆలోచన, ఈరోజు ఆయన్ని ఎంత పెద్ద వాడిని చేసిందో చూడండి. ఇకపోతే జగపతి బాబు సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటాడు. ఈయన పోస్టులు ట్విట్టర్ లో చాలా బోల్డ్ గా ఉంటాయి.

    రీసెంట్ గా ఆయన ఒక ఒక పోస్ట్ చేస్తూ ‘కాకర కాయ జ్యూస్, బెండకాయ జ్యూస్..పెరుగన్నం తో నారోజు మొదలైంది’ అంటూ ఒక పోస్ట్ చేస్తాడు. దీనికి స్పందించిన మంచు లక్ష్మి ‘బెండకాయ జ్యూస్ ఎందుకు?’ అని అడుగుతుంది. అప్పుడు జగపతి బాబు దానికి సమాధానం ఇస్తూ ‘లక్ష్మి..బెండకాయ జ్యూస్ ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిది. ముఖ్యంగా మన శరీరం లోని కొలెస్ట్రాల్ ని బాగా తగ్గిస్తుంది. అసలే నీకు నాకు కొవ్వు చాలా ఎక్కువ’ అని అంటాడు. దీనికి మంచి లక్ష్మి సమాధానం చెప్తూ ‘నాకు ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అన్నో..కేవలం మెంటల్ సమస్యలు మాత్రమే ఉన్నాయి’ అని అంటుంది. అలా వీళ్లిద్దరి ఫన్నీ సంభాషణకు ట్విట్టర్ లో నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి విషయానికి వస్తే ఈమె ఇండస్ట్రీ లోకి విలన్ రోల్ ద్వారానే అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజిని ఏర్పాటు చేసుకుంది. ఇక జగపతి బాబు విషయానికి వస్తే గతం లో ఉన్నంత డిమాండ్ ఈమధ్య కాలం లో జగపతి బాబు కి లేనట్టుగా అనిపిస్తుంది.

    అందుకు కారణం రెమ్యూనరేషన్ అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్. ఒక్కో సినిమాకి ఈయన రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడట. పెద్ద హీరోల నిర్మాతలు ఇచ్చేందుకు సిద్దమే కానీ, తక్కువ పని దినాలు ఉన్నప్పటికీ కూడా జగపతి బాబు అదే రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. అందుకే నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన ‘గుంటూరు కారం’, ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘సింబా’, ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప 2: ది రూల్’ లో నటిస్తున్నాడు. డిసెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తర్వాత జగపతి బాబు ఏ సినిమాకి కూడా సంతకం చేయలేదు.