https://oktelugu.com/

Aishwarya Rai Bachchan : బాలకృష్ణ కాళ్ళు పట్టుకున్న ఐశ్వర్య రాయ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!

ఉత్తమ నటి క్యాటగిరీ లో ఐశ్వర్య రాయ్ కి పొన్నియన్ సెల్వన్ చిత్రం కి లభించింది. ఇందులో ఆమె నెగటివ్ రోల్, పాజిటివ్ రోల్స్ తో ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2024 / 09:15 PM IST

    Aishwarya Rai holding Balakrishna's legs

    Follow us on

    Aishwarya Rai Bachchan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో ఒకటి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్. 2023 వ సంవత్సరం లో అద్భుతమైన నటన కనబర్చిన నటీనటులకు, ప్రేక్షకుల మెప్పుని పొందిన సినిమాలకు ఈ అవార్డ్స్ ని అందించేందుకు అబుదాబి లో గ్రాండ్ గా ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. మన టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే ఈవెంట్ నిర్వాహకులు బాలయ్య బాబు చేతుల మీదుగా కొన్ని అవార్డ్స్ ని ఇప్పించారు. విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కి కూడా ఆయన అవార్డుని తన చేతుల మీదుగా అందించాడు.

    ఉత్తమ నటి క్యాటగిరీ లో ఐశ్వర్య రాయ్ కి పొన్నియన్ సెల్వన్ చిత్రం కి లభించింది. ఇందులో ఆమె నెగటివ్ రోల్, పాజిటివ్ రోల్స్ తో ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సిరీస్ సృష్టించిన సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళం లో మొదటి భాగం కి 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ భాగానికి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మణిరత్నం దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ చిత్రం గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సి వస్తే ఐశ్వర్య రాయ్ నటన గురించి మాట్లాడుకోకుండా ఉండలేము, అలాంటి అద్భుతమైన నటన కనబర్చింది ఈమె. అందుకే ఆమెకు ఈ అవార్డు ని ప్రదానం చేసారు. నందమూరి బాలకృష్ణ ని స్టేజి మీదకు ఆహ్వానించి ఈ అవార్డు ని ఆయన చేతుల మీదుగా ఐశ్వర్య రాయ్ కి అందించారు. దీనికి ఐశ్వర్య రాయ్ ఎంతో సంతోషించింది. తనకు అవార్డుని ఇచ్చిన బాలయ్య పాదాలను మొక్కింది. అయితే ఐశ్వర్య ముఖాన్ని చూసిన అందరూ, ఆమెలో ఎదో తేడా ఉందని కామెంట్ చేస్తున్నారు.

    గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐశ్వర్య రాయ్ లో చాలా తేడా కనిపిస్తుందని, ముఖం బాగా లావు అయ్యింది అంటున్నారు నెటిజెన్స్. ఐశ్వర్య రాయి ప్రస్తుతం ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని, చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిందని, ఆ వ్యాధి ప్రభావం కారణంగానే ఆమెలో ఈ మార్పులు వచ్చాయని కూడా ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది. వీటిలో ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలియదు. ఇకపోతే ఇదే ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి కి కూడా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తన సమకాలీన హీరోలు వెంకటేష్, బాలకృష్ణ చేత ఈ అవార్డు ని ఇప్పించారు. దసరా కానుకగా ఈ ఈవెంట్ జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు.