https://oktelugu.com/

Game Changer Movie : గేమ్ చేంజర్’ లో మరో క్రేజీ స్టార్ హీరో..ట్విస్టుల మీద ట్విస్టులు..శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించగా, కైరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ ఒక చిన్న సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్టు కోలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ వినిపిస్తుంది

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 07:19 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం అభిమానులు,ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ ని మ్యాచ్ చేస్తూ ఒక సినిమా చేయాలంటే కేవలం శంకర్ లాంటి దర్శకుడికి మాత్రమే సాధ్యం అని, ఆయనతోనే సినిమాని సెట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. అన్ని ప్రాంతీయ భాషల్లో బిజినెస్ లు కూడా షూటింగ్ దశలోనే పూర్తి అయ్యిందంటే, ఈ సినిమాకి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించగా, కైరా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ ఒక చిన్న సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్టు కోలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ వినిపిస్తుంది. క్లైమాక్స్ లో కోలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపిస్తాడని, ఆయన పాత్ర కథని మలుపు తిప్పేలాగా ఉంటుందని, అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతారని తెలుస్తుంది.

    శివ కార్తికేయన్ కి కోలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కమెడియన్ స్థాయి నుండి నేడు ఆయన తమిళనాడు లో టాప్ 5 స్టార్ హీరోస్ లో ఒకడిగా మారిపోయాడు. ఆయన హీరోగా నటించిన ‘రెమో’, ‘డాక్టర్’ ,’డాన్’,’ప్రిన్స్’ వంటి చిత్రాలు తెలుగు లో కూడా దబ్ అయ్యి మంచి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ విధంగా శివ కార్తికేయన్ మన తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. కాబట్టి ఆయన అతిథి పాత్ర ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీపావళి సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనుంది మూవీ టీం. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, ఇప్పుడు ఈ టీజర్ తో సినిమా రేంజ్ ఎంత వరకు వెళ్తుంది అనే దానిపై అభిమానుల్లో ఒక అంచనా ఏర్పడుతుంది.