https://oktelugu.com/

‘మదగజ’ కోసం మైసూరులో జగపతి బాబు!

ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబుకు, ఇతర భాషల్లో కూడా ప్రతేక పాత్రల నటుడిగా ఈ మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమల నుండి కూడా జగపతి బాబుకు కీలక పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే కన్నడలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘రాబర్ట్‌’లో జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]

Written By:
  • admin
  • , Updated On : October 13, 2020 / 11:50 AM IST
    Follow us on


    ఫ్యామిలీ హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబుకు, ఇతర భాషల్లో కూడా ప్రతేక పాత్రల నటుడిగా ఈ మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమల నుండి కూడా జగపతి బాబుకు కీలక పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే కన్నడలో చాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘రాబర్ట్‌’లో జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీమురళి ‘మదగజ’ సినిమాలో కూడా నటిస్తోన్న జగ్గు భాయ్, పూర్తి నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాగా మైసూరులో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మదగజ’ సెట్ లో ప్రస్తుతం జగపతి బాబు పాల్గొన్నాడు.

    Also Read: అర్హ కోసం దిండుగా మారిన అయాన్!

    “నేను ఈ మధ్య కన్నడ సినిమాలు కూడా ఎక్కువుగా చేస్తున్నాను. అందుకే ఇప్పుడిప్పుడే కన్నడ భాషను కూడా నేర్చుకుంటున్నాను. ఈ క్రమంలోనే దర్శన్ ‘రాబర్ట్‌’ మూవీతో స్వయంగా కన్నడలో డబ్బింగ్ కూడా చెప్పబోతున్నాను” అని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు తెలిపారు. ఇక ‘మదగజ’ చిత్రయూనిట్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ “ఈ సినిమా నిర్మాత ఉమాపతి నిర్మాణ వ్యవహారాలకు సంబందించి చాల పర్ఫెక్ట్ గా పనిచేసే నిర్మాత. ఆయనలో నేను గమనించింది ఏమిటంటే, ఒక నిర్మాతగా ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో ఆయనకు బాగా తెలుసు, పైగా ప్రాజెక్టు జరుగుతున్నంత కాలం, చిత్రబృందంతోనే ఆయన కలిసి ఉంటారు.”

    Also Read: నాని ప్లాప్స్ కు కారణం అదేనట !

    అదే విధంగా మదగజ హీరో శ్రీమురళి గురించి మాట్లాడుతూ.. ‘తను చాల స్వీట్ పర్సన్. నేను ఇప్పుడే శ్రీమురళితో మాట్లాడటం మొదలుపెట్టాను, నిజంగా అతను వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి” అని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మదగజ చిత్రం షూటింగ్ పూర్తిస్థాయిలో శరవేగంగా జరుగుతోంది. చిత్రబృందం ఈ రోజు మైసూరు మరియు మైసూరు సమీపంలోని ప్రదేశాలలో షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీమురళి సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ సెట్స్ లో షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తరుచూ తమ అభిమానులతో పంచుకుంటుంటారు. ఏమైనా షూట్ లో ఉన్నప్పుడు వీరు చాల ఉత్సాహంగా ఉంటారట.