https://oktelugu.com/

హైదరాబాద్ హై అలర్ట్: వణికిస్తున్న వాయు‘గండం’!  

  కరోనా-లాక్డౌన్ పుణ్యాన ప్రకృతి క్లీన్ అయిపోయి ఠంచనుగా టైం ప్రకారం వానలు కొడుతున్నయ్.. ఏదో రిజర్వాయర్లు, చెరువులు నిండితే చాలు అనుకున్నం.. కాని ఈ రేంజ్లో దంచికొడుతయ్ అనుకోలేదు.. ఇప్పటికే అన్నీ జలాశయాలు నిండిపోగా ఇక చాలు అనుకున్న తరుణంలో మళ్లా నాలుగు రోజుల నుంచి ఒకటే వాన.. మరీ సోమవారం ఉదయం నుంచి ఆగి..ఆగి మరీ దంచుతోంది. బంగళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటనుండడంతో అందరూ అలర్ట్ గా ఉండాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 3:27 pm
    Follow us on

     

    కరోనా-లాక్డౌన్ పుణ్యాన ప్రకృతి క్లీన్ అయిపోయి ఠంచనుగా టైం ప్రకారం వానలు కొడుతున్నయ్.. ఏదో రిజర్వాయర్లు, చెరువులు నిండితే చాలు అనుకున్నం.. కాని ఈ రేంజ్లో దంచికొడుతయ్ అనుకోలేదు.. ఇప్పటికే అన్నీ జలాశయాలు నిండిపోగా ఇక చాలు అనుకున్న తరుణంలో మళ్లా నాలుగు రోజుల నుంచి ఒకటే వాన.. మరీ సోమవారం ఉదయం నుంచి ఆగి..ఆగి మరీ దంచుతోంది. బంగళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటనుండడంతో అందరూ అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం అలర్ట్ చేసింది. అయితే మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే బంగళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

    Also Read: రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై బాలీవుడ్ ప్రముఖుల యుద్ధం.. హైకోర్టుకు..

    ఎడతెరిపి లేని వానతో హైదరాబాద్ సిటీ ఆగమాగమవుతోంది..సోమవారం ఉదయం నుంచి నగరంలో గంటకోసారి గ్యాప్ ఇచ్చి మరీ వాన కొడుతోంది.  నాలాలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు వాగుల్లా మారిపోయాయి. కూకట్పల్లి–ఎల్బీనగర్ మార్గంలో అనేక చోట్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు రెండువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. ఏకధాటి వర్షంతో చాలా చోట్ల 11కేవీ ఫీడర్లు రిపేర్కు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో మూడు, నాలుగు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.

    నగరంలో మరో రెండు రోజులు కుండపోత వర్షం ఉండడంతో గ్రేటర్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.  శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  నగరంలో శిథిల స్థితికి చేరుకున్న అన్ని

    భవనాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. వచ్చే 72గంటలు సిటీ జనాలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. ఎఫెక్టెడ్ ఏరియా ప్రజలను పాఠశాలలు, సామాజిక భవనాల్లో వసతులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

    సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ ఆలం ప్రాంతంలో ఓ ఇల్లు కూలి ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అలాగే రాంనగర్ డివిజన్ సంజయ్నగర్ బస్తీలోనూ ఓ పాత గోడకూలి ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. అలాగే రాష్ట్రంలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. వనపర్తి జిల్లా జెర్రిబోతుల వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా వనపర్తిలో 7.8 సెంటీమీటర్లు, తిమ్మాజీపేట 7.1, మదనాపురం 6.9, గోపాల్పేట 6.3, గచ్చిబౌలి 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో అధిక వర్షాలకు వాతావరణం చల్లబడి కరెంట్ వినియోగం తగ్గింది. సోమవారం రాత్రి 8గంటల సమయానికి 5,862 మెగావాట్లు ఉండగా గతేడాది ఇదే సమయానికి 7,005 మెగావాట్ల డిమాండ్ ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు.

    Also Read: ఉత్తరాంధ్రకు ‘అక్టోబర్‌’ భయం..!

    రాష్ట్రంలో భారీ వర్షాల కురుస్తున్నందున పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో సూచించారు. డయల్ 100కు వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు.